
యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. సినీ సెలబ్రెటీలు, ఫాన్స్ తారక్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక తారక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. తారక్ ఈ మధ్య కాలంలో డబుల్ అయ్యింది. మొన్నటి వరకు టాలీవుడ్ కోలీవుడ్ పక్కనున్న కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే తారక్ కు ఫ్యాన్స్ ఉండే వాళ్ళు. ఇక రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు యంగ్ టైగర్. తారక్ డాన్స్ కు, యాక్టింగ్ కు ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండరేమో.. ప్రస్తుతం తారక్ డ్రాగన్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా డ్రాగన్ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేశారు.
ఇదిలా ఉంటే తన పెళ్ళికి తారక్ కారణమంటూ ఆయన గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు ప్రముఖం నిర్మాత కూతురు. ఆమె ఎవరో కాదు బడా ప్రొడ్యూసర్ అశ్వినిదత్ కుమార్తె స్వప్నా దత్. స్వప్నా దత్ ప్రసాద్ వర్మ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. 2010లో వీరి వివాహం జరిగింది. అయితే తమ ప్రేమ వ్యవహారం గురించి తాజాగా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ.. తన వివాహం జరగడానికి ఒక విధంగా ఎన్టీఆర్ కారణం అని తెలిపింది.
తాను ప్రేమలో ఉన్నప్పుడు ఆ విషయాన్నీ తారక్‌కు చెప్పారట స్వప్న. అయితే ఈ విషయాన్నీ ఆలస్యం చేయకుండా వెంటనే ఇంట్లో చెప్పేయమని అన్నారట ఎన్టీఆర్.. అయితే అప్పుడు ప్రేమ వివాహానికి మా ఇంట్లో ఒప్పుకునే పరిస్థితి లేదు అనడంతో.. ‘ఇలాంటి విషయాల్లో ఎక్కువ ఆలస్యం చేయకూడదు.. మీ నాన్నగారితో నేను మాట్లాడతాను’ అని షూటింగ్ మధ్యలోనే మా ఇంటికి వచ్చి నాన్న గారితో మాట్లాడాడు తారక్. అలా మా పెళ్ళికి తారక్ మూలకారణం అయ్యాడు అని అన్నారు స్వప్న. అశ్వినీదత్ ఫ్యామిలీకి ఎన్టీఆర్ ఫ్యామిలోకి మంచి అనుభందం ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్వప్న దత్ నిర్మాతగా రాణిస్తున్నారు.