Anil Ravipudi: ఆయన ఎఫ్3 సినిమా రిలీజ్‌కు ముందే హిట్ అని చెప్పేశారు.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఎఫ్ 2 ఇచ్చిన సక్సెస్ ను కంటిన్యూ చేస్తున్నారు వెంకటేష్, వరుణ్ తేజ్. రీసెంట్ గా ఎఫ్ 3 తో మరో హిట్ ను తమ కథలో వేసుకున్నారు ఈ క్రేజీ హీరోలు.

Anil Ravipudi: ఆయన ఎఫ్3 సినిమా రిలీజ్‌కు ముందే హిట్ అని చెప్పేశారు.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Anil Ravipudi

Edited By:

Updated on: May 31, 2022 | 7:41 PM

ఎఫ్ 2 ఇచ్చిన సక్సెస్ ను కంటిన్యూ చేస్తున్నారు వెంకటేష్(Venkatesh), వరుణ్ తేజ్. రీసెంట్ గా ఎఫ్ 3(F3)తో మరో హిట్ ను తమ కథలో వేసుకున్నారు ఈ క్రేజీ హీరోలు. అనిల్ రావిపూడి( Anil Ravipudi) దర్శకత్వం వచ్చిన ఎఫ్ 3 సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ లో హీరో వరుణ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముందుగా వ‌రుణ్‌తేజ్ మాట్ల‌డుతూ, ఎఫ్‌3 సినిమాను స‌క్సెస్ చేసిన తెలుగుప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్‌. స‌హ‌జంగా యాక్ష‌న్‌, మైథ‌లాజిక‌ల్ సినిమాల‌ను ఎంక‌రేజ్ చేస్తుంటారు. ఆ కోవ‌లోనే ఎఫ్‌3 సినిమాను స‌క్సెస్ చేశారు అన్నారు వరుణ్. పిల్ల‌లు కూడా సినిమా చూసి డాన్స్ చేస్తున్నారు. ఇలాంటి సినిమా తీసి ప్రెస్టేష‌న్ లేకుండా చేసిన ద‌ర్శ‌కుడు అనిల్‌గారికి థ్యాంక్స్‌. మా ఎఫ్‌3 కుటుంబ స‌భ్య‌లంద‌రికీ ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. కోవిడ్‌లో టైంలో ఇంటిలోవారికంటే ఈ టీమ్‌తోనే ఎక్క‌వ సేపు గ‌డిపాను. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు నాకు ఫ్రెండ్ లాంటివారు. వెంక‌టేష్‌గారికి, దిల్‌రాజు, అనిల్ గారికి బిగ్ థ్యాంక్స్‌ అన్నారు వరుణ్.

అలాగే ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. నాకిది 6వ సినిమా. ఉద‌య‌మే ఒక ఫోన్ కాల్ వ‌స్తే బ్లాక్ బ‌స్ట‌ర్‌. నాకు ప్ర‌తిసారీ వి.వి. వినాయ‌క్‌గారు చేస్తుంటారు. ఇలా ఆరోసారి చేశారు. ఇంకా చాలామంది ఫోన్‌లు చేశారు. మైత్రీమూవీస్‌ వారు ప‌ర్స‌న‌ల్‌గా కాల్ చేశారు. డి.సురేష్‌బాబుగారు సినిమా విడుద‌ల‌కు ముందే చూశారు. ఆయ‌న ముందే హిట్ అన్నారు. అలా నా సినిమాను హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేక ధ‌న్యవాదాలు తెలియ‌జేసుకుంటున్నాను అన్నారు అనిల్. ఈనెల 27న విడుద‌లై నేటికీ క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తూనే వుంది ఎఫ్ 3. ఈ వీక్ కూడా ఎగ్జిబిట‌ర్ల‌కు, కొన్న పంపిణీదారుల‌కు క‌లెక్ష‌న్ల‌తో న‌వ్వులు పూయించాల‌ని కోరుకుంటున్నా. నైజాంలో దాదాపు 9ల‌క్ష‌ల 50వేల మంది ఆడియ‌న్స్ చూశారు. పాండ‌మిక్ త‌ర్వాత సినిమా రంగం ఇబ్బందిలోవుంది. అందుకే ప్ర‌తి సెక్ష‌న్‌కు సినిమా చేరువ‌కావాల‌ని కోరుకున్నాం. అందుకు అఖండ‌, పుష్ప‌, ఆర్‌.ఆర్‌.ఆర్‌.. భీమ్లానాయ‌క్‌, స‌ర్కారువారిపాట చిత్రాలు థియేట‌ర్‌కు ప్రేక్ష‌కుల‌ను తీసుకు వ‌చ్చాయి. ఇప్పుడు ఎఫ్‌3 తీసుకువ‌చ్చింది. తెలుగు సినిమాకు పూర్వ‌వైభ‌వం తీసుకువ‌చ్చిన ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్‌. ఈ సినిమాకు నా వెన్నంటి వుండి బ‌లంగా నిల‌బ‌డిన దిల్‌రాజు, శిరీష్‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను అన్నారు.

ఇవి కూడా చదవండి

Ileana: నీ సన్నజాజి సోయగాలను చూసేందుకు నయనాలు చాలవే..ఇలియానా న్యూ లుక్స్ వైరల్..

Vidya Balan: ఉష్..! వయస్సుతో పని ఎం ఉంది..? అందమే మాట్లాడుతుంది.. విద్య బాలన్

Super Star Krishna Birthday: ఐ లవ్ యూ నాన్న.. తండ్రికి విషెష్ చెబుతూ మహేష్ ఎమోషనల్ పోస్ట్..