పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఓ వైపు సినిమాలు.. మరో వైపు రాజకీయాలతో పవన్ బిజీ బిజీ గా గడుపుతున్నారు. ఇప్పటికే పవన్ వరుస సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీర మల్లు సినిమా చేస్తున్నారు పవర్ స్టార్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గ నిధి అగర్వాల్ నటిస్తోంది.ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ తో ఓ సినిమా చేస్తున్నారు పవన్. ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత ఈ ఇద్దరి కాంబోలో రాబోతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
అలాగే తమిళ్ రీమేక్ మూవీ అయినా దీనికి సముద్రఖని దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా అందుకు సంబంధించిన సన్నాహాలను పూర్తి చేసుకుంటోంది. ఇదిలా ఉంటే పవర్ స్థార్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వలో సినిజమ చేయనున్నారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సురేందర్ రెడ్డి అఖిల్ తో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది.ఈ సినిమా తర్వాత పవన్ సినిమాను పట్టాలెక్కించనుందట సురేందర్ రెడ్డి. ‘ఏజెంట్’ తరువాత సురేందర్ రెడ్డి చేసే సినిమా పవన్ తోనే ఉంటుందని నిర్మాత రామ్ తాళ్లూరి తెలిపారు. దాంతో మెగా అభిమానులు సంతోషంవ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో ..చిరంజీవితో ‘సైరా’ .. చరణ్ తో ‘ధ్రువ’ .. బన్నీతో రేసుగుర్రం’ చేసిన సురేంద్ర రెడ్డి ఇప్పడు పవన్ తో సినిమా చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి