Game Changer: చరణ్ ఫ్యాన్స్‌ ఖుషీ అయ్యేలా చేసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు.. విషయమేంటంటే

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి బిగ్‌ అప్డేట్ రాకుండానే ఉంది. దీంతో ఈ మూవీ టీం పై చెర్రీ ఫ్యాన్స్‌ సీరియస్ అవుతున్నారు. మేకర్స్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు... గేమ్ ఛేంజర్‌ మూవీపై బిగ్ అప్డేట్ ఇచ్చారు.

Game Changer: చరణ్ ఫ్యాన్స్‌ ఖుషీ అయ్యేలా చేసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు.. విషయమేంటంటే
Game Changer

Updated on: Dec 04, 2023 | 2:02 PM

ప్రభాస్ సలార్ ట్రైలర్‌ కూడా వచ్చేసింది. డిసెంబర్ 22న సినిమా రిలీజ్ కానుంది. మరో పక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్.. దేవర నుంచి కూడా.. తర్వలో టీజర్‌ రిలీజ్ కానుందనే టాక్ ఉంది. కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి బిగ్‌ అప్డేట్ రాకుండానే ఉంది. దీంతో ఈ మూవీ టీం పై చెర్రీ ఫ్యాన్స్‌ సీరియస్ అవుతున్నారు. మేకర్స్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు… గేమ్ ఛేంజర్‌ మూవీపై బిగ్ అప్డేట్ ఇచ్చారు.

ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. చరణ్ నుంచి ఇప్పుడు సినిమా వస్తుందంటే అభిమానులు అదే రేంజ్ లో అంచనాలు పెట్టుకుంటారు. దాంతో రామ్ చరణ్ కూడా ఆచితూచి అడుగులేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్  శంకర్ ను లైనప్ చేశారు. శంకర్ డైరెక్షన్లో.. గ్రాండ్ స్కేల్లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్‌ మూవీ షూటింగ్‌ దాదాపు 80 శాతం పూర్తైందంటూ.. తాజాగా చెప్పారు దిల్ రాజు. అంతేకాదు డైరెక్టర్‌ శంకర్ పూర్తి నిబద్దతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టు మరో సారి ఫ్యాన్స్కు క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు.

ఇది మాత్రమే కాదు.. షూటింగ్ పూర్తి కాగానే.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తానంటూ కూడా… చెప్పారు. ఇక గేమ్ ఛేంజర్‌ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ లేదంటూ.. ఇన్నాళ్లూ ఫీల్ అవుతున్న ఫ్యాన్స్‌ను .. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒక్కసారిగా ఖుషీ అయ్యేలా చేశారు.

రామ్ చరణ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

రామ్ చరణ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.