Dhootha : ఓటీటీలో దూసుకుపోతోన్న అక్కినేని కుర్ర హీరో సిరీస్.. ట్రెండింగ్‌లో నాగచైతన్య దూత
నేషనల్ లెవల్లో అమెజాన్ ప్రైమ్‌లో నెంబర్ 1గా ట్రెండ్ అవుతోంది. ఇక విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో.. యువ సామ్రాట్ నాగచైతన్య చేసిన డెబ్యూ సిరీస్ దూత. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా.. తెరకెక్కిన ఈ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయింది. దర్శకుడు విక్రమ్ కె కుమార్ 13బీ, 24 చిత్రాల్లానే అందర్నీ థ్రిల్‌కు గురిచేస్తూ...
ఓ పక్క థియేటర్లలో.. ఊచకోత అంటే ఎలా ఉంటుందో యానిమల్ మూవీ చూపిస్తుండగా.. మరో పక్క ఇంట్లో.. థ్రిల్లర్ మజాను అందరికీ దిమ్మతిరిగే రేంజ్లో పరిచయం చేస్తోంది నాగచైతన్య దూత సిరీస్. పరిచయం చేయడమే కాదు.. పాజిటివ్ టాక్‌తో.. మంచి వ్యూస్‌ను దక్కించుకుంటోంది. నేషనల్ లెవల్లో అమెజాన్ ప్రైమ్‌లో నెంబర్ 1గా ట్రెండ్ అవుతోంది. ఇక విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో.. యువ సామ్రాట్ నాగచైతన్య చేసిన డెబ్యూ సిరీస్ దూత. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా.. తెరకెక్కిన ఈ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయింది. దర్శకుడు విక్రమ్ కె కుమార్ 13బీ, 24 చిత్రాల్లానే అందర్నీ థ్రిల్‌కు గురిచేస్తూ… ఓటీటీ ప్లాట్ ఫాం ప్రైమ్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది దూత. అంతేకాదు రిలీజ్ అయిన 24గంటల్లోనే నేషనల్ వైడ్ నెంబర్ 1 సిరీస్‌గా.. ప్రైమ్‌లో ర్యాంక్ వచ్చేలా చేసుకుంది.
సూపర్ నాచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌లో.. నాగచైతన్య జర్నలిస్టుగా నటించారు. పేపర్లో వచ్చిన ఆర్టికల్లో ఉన్నట్టే తన లైఫ్‌లో జరగడం.. అది ఓ మర్డర్‌తో కనెక్ట్ అవ్వడం.. అండ్ మధ్యలో వచ్చే సూపర్ నాచురల్ ఎలిమెంట్స్ ఈ సిరీస్ చూస్తున్న వారికి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తోంది. ఇంకోలా చెప్పాలంటే వణికిస్తోంది. అంతేకాదు సినిమాల్లో ఫెయిల్యూర్‌లో ఉన్న ఈ స్టార్ హీరోకు మంచి హిట్ నిచ్చింది ఈ దూత సిరీస్.
అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య దూత వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అత్యదిక వ్యూస్ సాధించి నేషనల్ లెవల్‌లో టాప్‌గా నిలిచింది దూత. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ పీరియాడిక్ సిరీస్‌కు విక్రమ్ కే కుమార్ దర్శకుడు. నాగ చైతన్యను మరికొంతమంది యంగ్ హీరోలు కూడా అనుసరిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు వెబ్ సిరీస్లు చేసేందుకు ముందుకు వస్తున్నారు మన కుర్ర హీరోలు..
Thank you Naana ! Glad your enjoying it 🙂 https://t.co/4TEz1H9lek
— chaitanya akkineni (@chay_akkineni) December 2, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.