Salaar : ట్రైలర్ అదిరిపోయింది.. కానీ! ఆ ఒక్కటే దెబ్బేసింది అంటున్నారుగా..
ప్రభాస్ మాస్ అవతార్ కు మరొక్కసారి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాను ఊపేస్తోంది ఈ ట్రైలర్. అలాగే యూట్యూబ్ లో మిళియన్స్ కొద్దివ్యూస్ ను సొంతం చేసుకొని ట్రెండింగ్ లో దూసుకుపోతోంది సలార్. ఆఫ్టర్ ఆదిపురుష్.. ప్రభాస్ చేస్తున్న హైయెండ్ యాక్షన్ ఫిల్మ్ సలార్. కరోనా ముందు నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా..

ఎప్పుడెప్పుడా అంటూ.. దాదాపు 4 నెలలుగా వెయిట్ చేస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్ ముందుకు సలార్ ట్రైలర్ అయితే వచ్చేసింది.! ఇప్పుడు ఈ ట్రైలర్ సినిమా మొదటి నుంచి ఉన్న అంచనాలను ఆకాశానికి చేర్చింది. ప్రభాస్ మాస్ అవతార్ కు మరొక్కసారి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాను ఊపేస్తోంది ఈ ట్రైలర్. అలాగే యూట్యూబ్ లో మిళియన్స్ కొద్దివ్యూస్ ను సొంతం చేసుకొని ట్రెండింగ్ లో దూసుకుపోతోంది సలార్. ఆఫ్టర్ ఆదిపురుష్.. ప్రభాస్ చేస్తున్న హైయెండ్ యాక్షన్ ఫిల్మ్ సలార్. కరోనా ముందు నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల.. పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు డిసెంబర్ 22న రిలీజ్ అవుతోంది.
సినిమా రిలీజ్ మాత్రమే కాదు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కూడా.. పోస్ట్ పోన్ అవుతూ.. ఎట్టకేలకు డిసెంబర్1న రిలీజ్ అయింది. అందరూ ఊహించినట్టే.. ఈ ట్రైలర్ అందరికీ హైని ఇచ్చింది. మూవీపై అంచనాలను మరింతగా పెంచేసింది. అయితే కొందరి దగ్గరి నుంచి మాత్రం ఈ ట్రైలర్ ప్రభాస్ రేంజ్‌కు తగ్గట్టులేదనే కామెంట్ వస్తోంది.
ట్రైలర్లోనే స్టోరీ ఏంటో చెప్పాలని.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చేసిన ప్రయత్నం అందర్నీ కాస్త కన్ఫూజ్ చేస్తోందనే టాక్ వినిపిస్తుంది. దాని వల్లే.. ట్రైలర్ ఎటూ అర్థం కాకుండా.. అంత ఇంపాక్ట్ ఫుల్‌గా లేకుండా ఉందనే కామెంట్ కూడా వస్తున్నాయి. అందులోనూ.. దాదాపు ట్రైలర్ చివర్లో ప్రభాస్‌ను రివీల్ చేయడం కొంత మంది ప్రభాస్ ఫ్యాన్స్‌కు నచ్చలేదు. కానీ ఏమాటకామాటే..! ట్రైలర్‌లోని లాస్ట్ 1 మినెట్ మాత్రం.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు మెంటల్ మాస్ ఫీలింగ్ నిచ్చింది. గూస్ బంప్స్ పుట్టేలా చేసింది. ఇలాంటి కట్సే ట్రైలర్ మొత్తం ఉంటే.. ట్రైలర్ ఇంకా పేలేదనే సీరియస్ కామెంట్ నెట్టింట వినిపిస్తుంది. ఇది జరగనందుకే.. సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌పై కొంత మందికి సీరియస్ ఫీలింగ్ కలుగుతోంది. అదే ఆయనను నెట్టింట విమర్శించేలా చేస్తోంది.
𝐏𝐥𝐞𝐚𝐬𝐞…𝐈…𝐊𝐢𝐧𝐝𝐥𝐲…𝐑𝐞𝐪𝐮𝐞𝐬𝐭!
Unleashing #SalaarTrailer: https://t.co/QiP7mGuixL#Salaar #SalaarCeaseFire #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur @shivakumarart… pic.twitter.com/iDFxzgGcGT
— Salaar (@SalaarTheSaga) December 1, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.
