Dil Raju: ‘ఇకపై ఊరుకోను.. తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తా’.. వారికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన దిల్‌ రాజు

| Edited By: Ravi Kiran

Jan 09, 2024 | 6:41 AM

సంక్రాంతి సినిమాలపై దిల్ రాజు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. తాజాగా ఓ సినిమా ఈవెంట్‌కు వచ్చిన దిల్‌రాజు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కన ఉంటూనే మనపై రాళ్లు వేసేవాళ్లు చాలా మంది ఉన్నారన్నారు. చిన్న సినిమాలు ప్రతి సంక్రాంతికి విడుదలవుతుంటాయని, ప్రతిసారీ..

Dil Raju: ఇకపై ఊరుకోను.. తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తా.. వారికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన దిల్‌ రాజు
Dil Raju
Follow us on

సంక్రాంతి సినిమాలపై దిల్ రాజు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. తాజాగా ఓ సినిమా ఈవెంట్‌కు వచ్చిన దిల్‌రాజు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కన ఉంటూనే మనపై రాళ్లు వేసేవాళ్లు చాలా మంది ఉన్నారన్నారు. చిన్న సినిమాలు ప్రతి సంక్రాంతికి విడుదలవుతుంటాయి. ఏదో రకంగా తనపై విమర్శలు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. చిరంజీవి తన గురించి మాట్లాడిన మాటలను కొన్ని వెబ్ సైట్లు తప్పుగా వక్రీకరించాయంటూ మండిపడ్డారు. తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తానంటూ హెచ్చరించారు. ‘ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదలవుతుంటాయి. ఏదో ఒక రకంగా నాపై ప్రతీ సంక్రాంతికి విమర్శలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో పక్కన ఉంటూనే మనపై రాళ్లు వేస్తారు. చిరంజీవి నాపై మాట్లాడిన మాటలకు కొన్ని వెబ్ సైట్లు తప్పుగా వక్రీకరించాయి. నాపై తప్పుడు వార్తలు రాస్తే వెబ్ సైట్ల తాటతీస్తా. తప్పుడు రాతలతో ఏం చేద్దామనుకుంటున్నారు. ఇకపై నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. మీ వైబ్ సైట్లకు నన్ను వాడుకుంటే తాటతీస్తా. వ్యాపార పరంగా వచ్చే విమర్శలను వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈరోజు నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు. తమిళ సినిమాలను నేనే వాయిదా వేశాను. హనుమాన్ సినిమా విడుదల చేయాలని నేనే చెప్పాను. నైజాంలో హనుమాన్ , గుంటూరు కారం సినిమాలకు థియేటర్లు ఉన్నాయి. నాగార్జున, వెంకటేశ్ సినిమాలకు థియేటర్లు దొరకడం లేదు’ అని దిల్‌ రాజు చెప్పుకొచ్చారు.

ఈసారి సంక్రాంతికి తెలుగులో భారీగా సినిమాలు రిలీజ్‌ కానున్నాయి. మహేశ్‌ బాబు గుంటూరు కారం, వెంకటేశ్‌ సైంధవ, నాగార్జున నా సామిరంగా, తేజ సజ్జా హనుమాన్ సినిమాలు పొంగల్‌ బరిలో నిలిచాయి. అయితే ఈ సినిమాలకు థియేటర్ల కేటాయింపుపై సీరియస్ గా  చర్చ నడుస్తోంది. కొన్ని సినిమాలకు తక్కువగా థియేటర్లును కేటాయించారంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో హనుమాన్‌ ప్రి రిలీజ్ ఈవెంట్‌ లో మెగా స్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను కొన్ని వెబ్‌ సైట్లు వక్రీ కరించి కథనాలు రాశాయి.  ఇప్పుడు ఇదే దిల్‌ రాజు ఆగ్రహానికి కారణమైందని తెలుస్తోంది.  అందుకే ఇకపై తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.   కాగా పోటీ కారణంగా సంక్రాంతి బరి నుంచి రవితేజ ఈగల్ పక్కకు తప్పుకుంది. అలాగే ధనుష్ కెప్టెన్ మిల్లర్ కూడా తెలుగులో రిలీజ్ కావడం లేదు. తాజాగా శివ కార్తికేయన్ అయలాన్ కూడా పొంగల్ బరిలో నుంచి తప్పుకుంది.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.