MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఉత్కంఠ పెరుగుతుంది. అధ్యక్ష పదవి కోసం హీరో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ ఇద్దరు తమ ప్యానల్స్‌తో ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. మా ఎన్నికల్లో ఎప్పుడైతే ప్రకాశ్ రాజ్ నిలబడుతున్నానని ప్రకటించారో అప్పటి నుంచే.. ‘మా పోరు’ ఓ థ్రిల్లర్ చిత్రాన్ని తలపిస్తూ.. రసవత్తరంగా సాగుతోంది. అభ్యర్థులు.. ప్రత్యర్థులు.. ప్లాన్లు, పార్టీలు.. ఆడియో రికార్డుల లీకులు.. ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాలో ఫైటింగ్‌లు ఇలా.. రకరకాలుగా సాగుతూ..రాజకీయాలనే తలదన్నుతోంది. ఎలక్షన్ డేట్ అక్టోబర్ 10 దగ్గరకు రావడంతో.. అభ్యర్థులు ఈ తరహా ప్రచారాలకే ఎక్కువగా ప్రాముఖ్యం ఇస్తూ… ‘మా’ మెంబర్స్ ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఆ మధ్య గణపతి కాంప్లెక్స్ ఏరియాలో చిన్న కళాకారులను కలిసి వారి కష్టాలను తెలుసుకున్నారు ప్రకాశ్‌రాజ్. మరోవైపు మంచు విష్ణు సినీ పెద్దలను కలుస్తూ తమ మద్దతు కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో నటీనటులకు నిర్మాతల మండలి ఓ విజ్ఞప్తి చేసింది. ‘మా’ ఎన్నికలు జరగనున్న ఈ నెల 10వ తేదీన ఓటు వేశాకే షూటింగ్‌లకు హాజరు కావాలని నిర్మాతల మండలి పిలుపునిచ్చింది. షూటింగ్ ల కారణంగా ఎవ్వరుకూడా తమ ఓటును దుర్వినియోగం చేసుకోకూడదని ఎన్నికల అధికారి నిర్మాతల మండలికి అభ్యర్థన చేయడంతో ఆ మండలి ఈ ప్రకటన చేసింది. ఇక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. మొదట ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా ఐదుగురు పోటీ చేయాలని భావించారు. చివరకు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మాత్రమే పోటీలో ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు విన్ అవుతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :