Fish Venkat: ఫిష్ వెంకట్‌ దీన స్థితి చూసి చలించిపోయిన ప్రముఖ నిర్మాత.. ఆర్థిక సాయం అందజేత

|

Sep 04, 2024 | 9:37 PM

వందలాది తెలుగు సినిమల్లో కామెడీ విలన్ గా నటించిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీన స్థితిలో ఉన్నారు. కాలు మొత్తం ఇన్ఫెక్షన్ కు గురైంది. రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీంతో ఏడాదిన్నరగా పంజా గుట్ట నిమ్స్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. తీవ్ర అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు ఫిష్ వెంకట్. సినిమా ఛాన్స్ లు వస్తున్నా షూటింగులకు వెళ్లేందుకు శరీరం సహకరించడం లేదు.

Fish Venkat: ఫిష్ వెంకట్‌ దీన స్థితి చూసి చలించిపోయిన ప్రముఖ నిర్మాత.. ఆర్థిక సాయం అందజేత
Fish Venkat
Follow us on

వందలాది తెలుగు సినిమల్లో కామెడీ విలన్ గా నటించిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీన స్థితిలో ఉన్నారు. కాలు మొత్తం ఇన్ఫెక్షన్ కు గురైంది. రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీంతో ఏడాదిన్నరగా పంజా గుట్ట నిమ్స్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. తీవ్ర అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు ఫిష్ వెంకట్. సినిమా ఛాన్స్ లు వస్తున్నా షూటింగులకు వెళ్లేందుకు శరీరం సహకరించడం లేదు. దీంతో ఇంటి పట్టునే ఉండడంతో ఈ నటుడి కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామ్ నగర్ లోని తన ఇంట్లోనే దయనీయ జీవితం గడుపుతోంది ఫిష్ వెంకట్ ఫ్యామిలీ. ఇటీవల ప్రముఖ ఛానెల్ ఆయనను సంప్రదించగా అతని దీన స్థితి వెలుగులోకి వచ్చింది. ఈ ఇంటర్వ్యూ వేదికగానే తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకున్నాడు. ఆయన పరిస్థితి చూసిన అభిమానులు, నెటిజన్లు ఎమోషనల్ అయ్యారు. సినీ ఫిష్ వెంకట్ ఫ్యామిలీని ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నటుడి దీన పరిస్థితి చూసి చలించిపోయిన ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. టీఎఫ్‌పీసీ ట్రెజరర్ నిర్మాత రామసత్యనారాయణ, సెక్రటరీ టి.ప్రసన్నకుమార్, దర్శకుడు కె.అజయ్ కుమార్, తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ లు చదలవాడ శ్రీనివాసరావు తరఫున ఫిష్ వెంకట్‌కు లక్ష రూపాయల చెక్కును అందజేశారు.

జీవితాంతం రుణపడి ఉంటాను: ఫిష్ వెంకట్

ఈ సంద‌ర్భంగా ఫిష్ వెంకట్ మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయ్యారు. త‌న కష్టాన్ని తెలుసుకుని అడగకుండానే లక్ష రూపాయలు సహాయం అందించిన నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ‌జేశారు. ఆయన చేసిన ఈ సాయాన్ని జీవితంలో ఎన్న‌టికి మ‌రిచిపోలేనన్నారు. ఆయనకు త‌న‌తో పాటు త‌న‌ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంద‌ని తెలిపారు. ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయన పైన ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ఫిష్ వెంకట్ భావోద్వేగానికి లోనయ్యారు.

ఇవి కూడా చదవండి

 నటుడు ఫిష్ వెంకట్ కు లక్ష రూపాయల చెక్కను అందజేస్తున్న తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సభ్యులు..

కాగా నిర్మాత చదల వాడ శ్రీనివాసరావు లాగే మరికొందరు దాతలు. సినీ పెద్దలు ముందుకు వచ్చి నటుడు  ఫిష్ వెంకట్ కుటుంబాన్ని ఆదుకోవాలని సినీ అభిమానులు, నెటిజన్లు కోరుతున్నారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.