NTR: స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో తారక్ కంటే ముందు ఆ స్టార్ హీరోతో చేయాలనుకున్నారట..

ఎంత పెద్ద డైలాగ్ అయినా సింగిల్ టెక్ లో చెప్పే నటుడిగా తారక్ కు పేరు ఉంది. ఇక తారక్ హీరోగా నటించిన తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్. ఈ సినిమాతో దర్శక ధీరుడు రాజమౌళి కూడా డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

NTR: స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో తారక్ కంటే ముందు ఆ స్టార్ హీరోతో చేయాలనుకున్నారట..
Ntr

Updated on: Dec 19, 2022 | 8:52 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్, ఆయనకు ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికి తెలుసు. తారక్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్ కు పూనకాలే. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. తారక్ నటనకు, డాన్స్ కు, స్టైల్ కు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. ఎంత పెద్ద డైలాగ్ అయినా సింగిల్ టెక్ లో చెప్పే నటుడిగా తారక్ కు పేరు ఉంది. ఇక తారక్ హీరోగా నటించిన తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్. ఈ సినిమాతో దర్శక ధీరుడు రాజమౌళి కూడా డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన, రాజమౌళి స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ముందుగా ఈ సినిమాకు తారక్  ను హీరోగా అనుకోలేదట . తారక్ కంటే ముందు ఈ సినిమాకోసం మరో హీరోను ఎంపిక చేశారట.

స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాను ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించారు. ఇటీవలే ;ఓ ఇంటర్వ్యూలో అశ్వినీదత్ మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో తారక్ కంటే ముందు ప్రభాస్ ను ఎంపిక చేశాం అని చెప్పారు.

స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతోనే ప్రభాస్ ను హీరోగా పరిచయం చేయాలనీ అనుకున్నారట అశ్వినీదత్. ఆ దిశగా చర్చలు కూడా జరిపారట. అదే సమయంలో హరికృష్ణ నుంచి ఫోన్ రావడంతో ఈ సినిమా తారక్ కు వచ్చిందట. అలా ఆ సినిమాలో ప్రభాస్ ను కాదని ఎన్టీఆర్ ను తీసుకున్నామని అశ్విని దత్ చెప్పారు. 2001లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి