అమ్మ చేతిలో బూరె బుగ్గలతో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. మొదటి సినిమాతోనే మనసులు దోచేసింది ఈ బ్యూటీ..

|

Aug 08, 2021 | 6:44 PM

టాలీవుడ్‌‌‌లో కొత్త అందాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ అవ్వలేరు. కొంతమంది మాత్రం ఇట్టే క్లిక్ అవుతారు.

అమ్మ చేతిలో బూరె బుగ్గలతో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. మొదటి సినిమాతోనే మనసులు దోచేసింది ఈ బ్యూటీ..
Follow us on

Priyanka Jawalkar: టాలీవుడ్‌‌‌లో కొత్త అందాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ అవ్వలేరు. కొంతమంది మాత్రం ఇట్టే క్లిక్ అవుతారు. ఈ అమ్మడు కూడా అంతే.. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. క్యూట్ లుక్స్‌‌‌‌తో కుర్రకారును కట్టిపడేసింది. ఇప్పుడు ఆ వయ్యారి సంబంధించిన చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అమ్మ చేతిలో బూరె బుగ్గలతో కనిపిస్తున్న చిన్న పాప ఎవరో గుర్తుపట్టారా.. చిన్నప్పుడు ఎంత క్యూట్‌‌‌‌‌గా ఉందో ఇప్పుడు అంతకు మించి క్యూట్‌‌‌‌నెస్‌‌‌‌తో ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఆ అమ్మడు ఎవరో కాదు.. ప్రియాంక జవాల్కర్. టాక్సీవాలా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస ఆసినిమాలతో దూసుకుపోతోంది.

సినిమాలకంటే ముందు ఈ బ్యూటీ షార్ట్ ఫిలిమ్స్‌‌‌‌లో నటించింది. మొదటి సినిమానే క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ అందుకుంది ప్రియాంక జవాల్కర్. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ప్రియాంక జవాల్కర్‌‌‌కు ఆఫర్లు క్యూ కట్టాయి. రీసెంట్‌‌‌గా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిన్నది. సత్యదేవ్ నటించిన తిమ్మరుసు సినిమాలో హీరోయిన్‌‌‌‌గా చేసింది ఈ బ్యూటీ. అలాగే కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాలో హీరోయిన్‌‌‌గా నటించింది ప్రియాంక జవాల్కర్. ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్‌‌‌తో దూసుకుపోతున్నాయి. ఇలా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అనుకున్న ఈ వయ్యారి ఇప్పుడు మరిన్ని ఆఫర్స్‌‌‌ను తన కిట్టీలో వేసుకుంటుంది. ప్రస్తుతం ప్రియాంక జవాల్కర్ చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

BIgg Boss 5: ఆ స్టార్‌ యాంకర్‌ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా.? సాలిడ్‌ హింట్‌ ఇచ్చిన కో యాంకర్‌.

Nagarjuna: వైరల్ అవుతున్న నాగ్ నయా లుక్.. చైతూ- అఖిల్‌‌‌‌కు అన్నయ్యలా ఉన్నారుగా..

Prabhas’s Salaar : డార్లింగ్ అభిమానులకు అదిరిపోయే సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌ను ప్లాన్ చేస్తున్న సలార్ మేకర్స్.