Priyanka Chopra : టాక్సీ డ్రైవర్‌కు చావు భయం చూపించిన అమ్మా.. 11 ఏళ్ల వయసులో అలాంటి ఘటన.. ప్రియాంక చోప్రా..
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన ఆమె.. ఇప్పుడు హాలీవుడ్ లో సత్తా చాటుతుంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వారణాసి చిత్రంలో నటిస్తుంది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె 11 ఏళ్ల వయసులో తన తల్లి చూపించిన ధైర్యం గురించి పంచుకుంది.

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం వారణాసి చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం కీలకపాత్రలో నటిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. పాన్ వరల్డ్ లెవల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదివరకు విడుదలైన గ్లింప్స్ హైప్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఆమె ది బ్లఫ్ అనే ఓటీటీ సినిమాలో నటించింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో సందర్భంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన తల్లి మధు చోప్రా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ప్రియాంక చోప్రా. తన తల్లిలోని ధైర్య సాహాసాల గురించి చెప్పుకొచ్చింది.
ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..
ప్రియాంకకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తల్లితో కలిసి ఢిల్లీలో ఒక టాక్సీలో ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన సంఘటనను గుర్తుచేసుకుంది. “మేము ఢిల్లీలోని ఒక హోటల్లో ఉంటున్నాము. ఒకసారి క్యాబ్ లో వెళ్తుండగా.. డ్రైవర్ సడెన్ గా దారి మార్చి తెలియని ప్రాంతానికి తీసుకెళ్తున్నాడు. అప్పుడే మా అమ్మ అడగడంతో షార్ట్ కట్ అని చెప్పాడు. దీంతో మా తల్లి ముందే ప్రమాదాన్ని పసిగట్టి.. వెనక సీట్లో కూర్చున్న అమ్మ.. వెంటనే డ్రైవర్ గొంతును గట్టిగా పట్టుకున్నారు. మెయిన్ రోడ్డుకు వెళ్లమని హెచ్చరించింది. ఆ తర్వాత అతడిని చెంపదెబ్బ కొట్టి మరీ వెనక్కు తీసుకెళ్లింది. నా కూతురితో నేను ఉన్నాను అంటూ మా అమ్మ అరవడం చూసి షాకయ్యాను” అంటూ చెప్పుకొచ్చింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..
కానీ హోటల్ కు వచ్చాక తన తల్లి చాలా భయంతో వణికిపోయిందని.. బహుశా ఒంటరిగా ఉంటే అలా చేసేది కాదేమో.. తాను తోడుండంతో తనలోని రక్షించే గుణం బయటకు వచ్చిందని.. తన తల్లిలో ఆ ధైర్యాన్ని అప్పటివరకు ఎప్పుడూ చూడలేదని చెప్పుకొచ్చింది.
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..
