AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIM Fraud: ఇలాంటి సిమ్‌ కార్డు మోసం మీకెప్పుడైనా జరిగిందా? జాగ్రత్త!

SIM Card Fraud: ప్రతి ఒక్కరికి సిమ్‌ కార్డు ఉంటుంది. కానీ కొందరిపై ఒకటి కంటే సిమ్‌ కార్డులు ఉంటాయి. మరి కొందరికి ఒకే సిమ్‌ కార్డు ఉన్నప్పటికీ వారి ఆధార్‌పై ఎక్కువ సిమ్‌ కార్డులు ఉన్నట్లు చూపిస్తుంటుంది. కానీ వాడేది ఒకే సిమ్‌. మరి ఇలా ఎందుకు జరుగుతుందో తెలిస్తే మీరే షాకవుతారు..

SIM Fraud: ఇలాంటి సిమ్‌ కార్డు మోసం మీకెప్పుడైనా జరిగిందా? జాగ్రత్త!
Sim Fraud
Subhash Goud
|

Updated on: Feb 20, 2026 | 5:23 PM

Share

SIM Card Fraud: ప్రస్తుత డిజిటల్ యుగంలో, మొబైల్ ఫోన్‌లు, సిమ్ కార్డులు మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారాయి. కొత్త సిమ్ కార్డు పొందడం, నెట్‌వర్క్ సమస్యలను పరిష్కరించుకోవడం వంటివి సాధారణ విషయాలు. అయితే ఈ ప్రక్రియలో ఆధార్ కార్డు దుర్వినియోగం పెరిగి, మనకు తెలియకుండానే మన పేరు మీద అదనపు సిమ్ కార్డులు నమోదవడం ఆందోళన కలిగించే విషయం. ఇటీవల చాలా మంది తమ ఆధార్‌పై అనధికార సిమ్ కార్డులు ఉన్నాయని కనుగొని షాక్‌కు గురవుతున్నారు.

ఎలా జరుగుతుంది ఈ మోసం?

సాధారణంగా ఒక వ్యక్తి కొత్త సిమ్ కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని సమర్పిస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ కాపీలు దుర్వినియోగం అవుతాయి. ఒక కాపీని పక్కన పెట్టి దానిని ఉపయోగించి మోసగాళ్లు అదనపు సిమ్ కార్డులను పొందవచ్చు. ఈ సిమ్ కార్డులను అక్రమ కార్యకలాపాలకు ఉపయోగించినప్పుడు అసలు ఆధార్ కార్డుదారుడు చట్టపరమైన చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. చాలా మంది తమ పేరు మీద కేవలం ఒక సిమ్ మాత్రమే ఉన్నదని భావిస్తారు. కానీ వాస్తవానికి వారి ఆధార్‌పై పదుల సంఖ్యలో సిమ్ లు నమోదు చేసి ఉండవచ్చు.

ఇది కూడా చదవండి: PhonePe: ఇక UPI పిన్ అవసరం లేదు.. ఇప్పుడు వేలిముద్రతోనే ఆన్‌లైన్‌ చెల్లింపులు!

ఇవి కూడా చదవండి

ప్రభుత్వం అందించిన పరిష్కారం: TAFCOP పోర్టల్:

ఇలాంటి మోసాలను అరికట్టడానికి, పౌరుల భద్రతను నిర్ధారించడానికి భారత ప్రభుత్వం tafcop.sancharsaathi.gov.in అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ టెలికాం ఎనాలిసిస్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAFCOP) పోర్టల్ వినియోగదారులకు తమ ఆధార్ నంబర్‌పై ఎన్ని మొబైల్ కనెక్షన్‌లు యాక్టివ్‌గా ఉన్నాయో తనిఖీ చేయడానికి వీలు కల్పిస్తుంది.

TAFCOP ద్వారా మీ సిమ్ కార్డులను తనిఖీ చేయడం ఎలా?

1. వెబ్‌సైట్: ముందుగా tafcop.sancharsaathi.gov.in వెబ్‌సైట్‌ను మీ బ్రౌజర్‌లో ఓపెన్‌ చేయండి.

2. మొబైల్ నంబర్ నమోదు: వెబ్‌సైట్‌లో కనిపించే బాక్స్‌లో మీ ప్రస్తుత మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. ఇది మీ ఆధార్‌తో అనుసంధానించబడిన నంబర్ అయి ఉండాలి.

3. OTP ధృవీకరణ: మీరు నమోదు చేసిన నంబర్‌కు ఒక వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది. ఆ OTPని సంబంధిత బాక్స్‌లో ఎంటర్ చేసి ధృవీకరించండి.

4. నమోదిత సిమ్ కార్డుల జాబితా: OTP ధృవీకరణ పూర్తయిన తర్వాత మీ ఆధార్ నంబర్‌తో అనుసంధానించిన అన్ని మొబైల్ నంబర్‌ల జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది.

5. అనధికార నంబర్‌లను గుర్తించడం, నివేదించడం: ఈ జాబితాలో మీకు తెలియని లేదా మీరు ఉపయోగించని ఏవైనా నంబర్‌లు ఉంటే, వాటిని గుర్తించండి. ప్రతి అనధికార నంబర్ పక్కన నాట్ మై నంబర్ (Not My Number) లేదా ఇది నా నంబర్ కాదు అనే ఎంపిక ఉంటుంది. దానిని ఎంచుకోండి.

6. ఫిర్యాదు నమోదు: ఎంపిక చేసిన తర్వాత రిపోర్ట్ బటన్‌పై క్లిక్ చేయండి. మీ ఫిర్యాదు నమోదు నమోదు అవుతుంది. అలాగే టెలికాం అధికారులు దానిపై చర్య తీసుకుంటారు. అనధికారిక సిమ్ కార్డులను రద్దు చేయడానికి ఇది సహాయపడుతుంది.

సిమ్ కార్డ్ మోసాలు, ఆధార్ దుర్వినియోగం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి TAFCOP పోర్టల్ ఒక శక్తివంతమైన సాధనం. ఈ వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం ద్వారా మీ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకోవచ్చు. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, పరిచయస్తులతో పంచుకోవడం ద్వారా అందరూ అప్రమత్తంగా ఉండేలా సహాయపడండి. ఆధార్ కార్డును జిరాక్స్ కోసం ఇచ్చేటప్పుడు లేదా ఇతరత్రా ప్రైవేటు వివరాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మీ బాధ్యత.

ఇది కూడా చదవండి: మీ BSNL నంబర్‌ డీయాక్టివేట్‌ అయ్యిందా? మీకో గుడ్‌న్యూస్‌.. చౌకైన ప్లాన్‌తో 90 రోజులు!

ఇది కూడా చదవండి: Vande Bharat: సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు వచ్చే వందే భారత్ సమయ వేళల్లో మార్పు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us