Priyanka Arul Mohan: క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న పుత్తడిబొమ్మ ప్రియాంక మోహన్..

ప్రియాంక అరుళ్ మోహన్.. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ అందాల భామ.

Priyanka Arul Mohan: క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న పుత్తడిబొమ్మ ప్రియాంక మోహన్..
Priyanka

Updated on: May 29, 2022 | 5:37 PM

ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan).. నాని(Nani)నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ అందాల భామ. క‌న్న‌డ‌, త‌మిళ‌ చిత్రాల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్‌తో కలిసి శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలు త‌న‌కు పెద్ద‌గా పేరు రాక‌పోయినా త‌మిళంలో శివ‌కార్తియేష‌న్ తో చేసిన ` డాక్ట‌ర్` సినిమా చ‌క్క‌టి గుర్తింపు తెచ్చింది. తెలుగులోనూ ఆ సినిమా విడుదలైన మంచి టాక్ సంపాదించుకుంది. ఈ మధ్య త‌మిళంలో స్టార్ హీరో సూర్య‌తో ఇ.టి. (ఎవ‌రికీ త‌ల‌వంచ‌డు) సినిమా చేసింది. రీసెంట్ గా డాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిన్నది. శివ‌కార్తియేష‌న్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

మే 13న విడుదలైన ఈ చిత్రం సూపర్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన చిన్న సినిమాల్లో ఒకటిగా కూడా డాన్ నిలిచింది. డాన్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ప్రియాంకకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తెలుగులోనూ ఈ అమ్మడికి ఆఫర్లు వస్తున్నాయి. అలాగే  స్టార్ హీరో ధనుష్ ప్రాజెక్టు కూడా చేయనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ప్రియాంక ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తుంది. త్వరలో ఆ హీరో ఎవరో.. ఆ సినిమా ఏంటో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రియాంక కెరీర్ లో మరో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ పడితే స్టార్ హీరోయిన్ గా మారిపోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

ఇవి కూడా చదవండి

Bhanu Chander: రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన సీనియర్ హీరో.. ఆ సినిమా డబ్బింగ్ చెబుతున్నప్పుడే అర్థమైందంటూ..

Nayanthara Vignesh: నయన్, విఘ్నేష్ పెళ్లి కార్డు రెడీ ?.. సోషల్ మీడియాలో వైరలవుతున్న పెళ్లి పత్రిక..

Singeetam Srinivasa rao: లెజండరీ డైరెక్టర్ ఇంట విషాదం.. సింగీతం శ్రీనివాస రావుకు సతీ వియోగం..

 

Follow Us