త‌న శ్రీవారు బంగారం అంటోన్న ప్రియ‌మ‌ణి…

దక్షిణాదిలో ఉన్న టాలెంటెడ్ క‌థానాయిక‌ల్లో ప్రియమణి ఒక‌రు. నేష‌న‌ల్ అవార్డు సైతం సొంత చేసుకుంది ఈ న‌టి.

త‌న శ్రీవారు బంగారం అంటోన్న ప్రియ‌మ‌ణి...

Updated on: Jul 25, 2020 | 8:04 PM

Actress Priyamani : దక్షిణాదిలో ఉన్న టాలెంటెడ్ క‌థానాయిక‌ల్లో ప్రియమణి ఒక‌రు. నేష‌న‌ల్ అవార్డు సైతం సొంతం చేసుకుంది ఈ న‌టి. సౌత్ లో అగ్ర‌హీరోల ప‌క్క‌న న‌టించి మంచి పేరు తెచ్చుకున్న‌ ఈ ముద్దుగుమ్మ ‘రావణ్’ సినిమాతో హిందీవైపు కూడా అడుగులు వేసింది. పెళ్లి తర్వాత కూడా అదే జోరు కొన‌సాగిస్తోంది. ప్రస్తుతం తెలుగులో ”విరాటపర్వం, నారప్ప” చిత్రాల్లో నటిస్తున్న ప్రియమణి… ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన భర్త ముస్తఫా రాజ్ గురించి ఇంట్ర‌స్తింగ్ విషయాలు చెప్పింది.

త‌న శ్రీవారు బంగారం అంటూ పోగిడిన‌ ప్రియమణి, ఆయన కారణంగానే ఇంకా సినిమాల్లో ఆత్మ‌విశ్వాసంతో న‌టిస్తున్నానని తెలిపింది. హీరోయిన్ల లైఫులో పెళ్లి తర్వాత చాలా మార్పులు వ‌స్తాయ‌ని.. భర్త స‌హాయ‌, స‌హకారాలు లేదంటే సినిమాల్లో రాణించ‌డం క‌ష్ట‌మ‌ని చెప్పింది. కానీ ఆ విషయంలో తాను చాలా ల‌క్కీ అని, తనను అర్థం చేసుకునే భర్త దొరికాడని తెలిపింది. అందుకే పెళ్లైన మూడో రోజునే షూటింగ్ లో పాల్గొన‌గలిగాన‌ని వివ‌రించింది. లాక్‌డౌన్ కారణంగా త‌న భ‌ర్త‌తో చాలా స‌మ‌యం గ‌డిపే అవ‌కాశం వ‌చ్చింద‌ని, కుటుంబ జీవితం పట్ల తాను చాలా ఆనందంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ప్ర‌స్తుతం తెలుగులో ఆమె చేస్తోన్న ‘విరాటపర్వం’ సినిమాలో భారతక్క పాత్ర కోసం శిక్ష‌ణ తీసుకున్న‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌ను ప్రియ‌మ‌ణి ఖండించింది. ఆ పాత్ర‌కు సంబంధించి ద‌ర్శ‌కుడు ఏం చెబితే అదే ఫాలో అవుతున్న‌ట్లు వివ‌రించింది. కాగా ఇటీవ‌ల నార‌ప్ప మూవీ నుంచి విడుద‌లైన ప్రియ‌మ‌ణి ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

 

ఇది కూడా చ‌ద‌వండి: పెళ్లిపీట‌లెక్క‌బోతున్న టాలీవుడ్ రైట‌ర్ ప్ర‌సన్న‌..