Priya Bhavani: డబ్బుల కోసమే సినిమాల్లోకి వచ్చా.. అందరూ చేసేది అదే కదా.. ఇందులో చర్చించాల్సింది ఏముంది..

ప్రియా భవానీ శంకర్‌.. ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ పై ఆగ్రహం వ్యక్తం  చేసింది. అంతేకాదు అసలు ఏమీ తెలియకుండా ఇలాంటి వార్తలు రాయడం దారుణం అంటూ వ్యాఖ్యానించింది. తాను నటనను వృత్తిగా డబ్బు కోసమే ఎంచుకున్నని.. ఇది అందరు చేసే పనే.. ఇందులో చర్చించాల్సిని అవసరం ఏముంది అంటూ వ్యాఖ్యానించింది.

Priya Bhavani: డబ్బుల కోసమే సినిమాల్లోకి వచ్చా.. అందరూ చేసేది అదే కదా.. ఇందులో చర్చించాల్సింది ఏముంది..
Priya Bhavani Shankar

Updated on: Jan 19, 2023 | 9:26 PM

ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత.. సెలబ్రెటీల పై అనేక రకాల కథనాలు వండి వార్చేస్తున్నారు అంటూ తరచుగా ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే సినీ, క్రీడాకారులు తమపై వెబ్ సైట్స్ లో లేదా యూ ట్యూబ్ వంటి  వాటిల్లో వచ్చే కథనాలు.. పెట్టె టైటిల్స్ పై విరుచుకుని పడడమే కాదు.. కొన్నింటిపై కేసులు కూడా పెట్టిన సంఘటనలు ఉన్న సంగతి తెలిసిందే.. తాజాగా తన గురించి తప్పుడు సమాచారంతో తప్పుడు కథనాలు ప్రచురించారంటూ నటి ప్రియా భవానీ శంకర్‌.. ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ పై ఆగ్రహం వ్యక్తం  చేసింది. అంతేకాదు అసలు ఏమీ తెలియకుండా ఇలాంటి వార్తలు రాయడం దారుణం అంటూ వ్యాఖ్యానించింది. తాను నటనను వృత్తిగా డబ్బు కోసమే ఎంచుకున్నని.. ఇది అందరు చేసే పనే.. ఇందులో చర్చించాల్సిని అవసరం ఏముంది అంటూ వ్యాఖ్యానించింది. వెబ్ సైట్ ప్రచురించిన వార్తా కథనాన్నిషేర్‌  చేస్తూ.. ఓ ప్రకటన రిలీజ్ చేసింది ప్రియా భవానీ శంకర్‌.

తాను ఎక్కువగా డబ్బులు సంపాదించుకోవడం కోసమే బుల్లి తెర నుంచి వెండి తెరపై అడుగు పెట్టినట్లు  ఎక్కడ చెప్పాను .. ఏ ఆధారంతో ఇలాంటి వార్తలు రాస్తారు అంటూ ఒక మీడియా పోర్టల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మొదట ఇలాంటి వార్తలకు స్పందిచకూడదని భావించాను.. అయితే పేరున్న వెబ్‌సైట్స్‌లోనూ మసాలా దట్టించి ఇలాంటి వార్తలు రాయడంతో తాను స్పందించినట్లు స్పష్టం చేసింది. ప్రియా. తాను అసలు డబ్బుల గురించి రెమ్యునరేషన్ గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.. ఒక వేళ చేసినా అందులో తప్పు ఏముంది అని ప్రశ్నించింది.. అంతేకాదు నేను కూడా అందరిలానే డబ్బుల కోసం పనిచేస్తున్నా.. మీరు కూడా అందుకే పనిచేస్తున్నారు కదా.. ఒక్క నటీనటుల విషయంలో మాత్రమే ఇలా ఎక్కువ చేసి వార్తలు ఎందుకు రాస్తారో అంటూ అసహనం వ్యక్తం చేసింది  ప్రియా భవానీ శంకర్‌.

ఇలాంటి వార్తలు రావడం దురదృష్టకరం. నేను ఇప్పటివరకూ అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఒకవేళ చేసినా అందులో తప్పు ఏముంది? అవును.. అందరిలాగానే నేనూ డబ్బు కోసమే పనిచేస్తున్నా! ఏ మీరు అలా కాదా? ఒకవేళ నటీనటులు మాత్రమే ఇలాంటి కామెంట్స్‌ చేస్తే ఎందుకు చీప్‌గా చూస్తారు. ఒక వ్యక్తిని తక్కువ చేసేలా ఇలాంటి కథనాలు రాయడం తగదు. ఎవరినీ ఇబ్బందిపెట్టకుండా, అలాగే తక్కువ చేయకుండా నా పని నేను చేసుకుంటున్నా’’ అని ఆమె తెలిపారు.

బుల్లితెరపై మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియా భవానీ..  మేయాధ మాన్‌’తో  వెండి తెరపై అడుగు పెట్టింది. టాలీవుడ్ లో ‘కళ్యాణం కమనీయం’తో పరిచయం అయింది. తెలుగు, తమిళంలో వరుస సినిమాలల్లో అవకాశాలను అందుకుని బిజీబిజీగా ఉంది ప్రియా భవానీ.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…