Prithviraj Sukumaran: ఆ స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తా: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అక్కడ సూపర్ హిట్స్ లో నటించారు పృథ్వీరాజ్‌.

Prithviraj Sukumaran: ఆ స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తా: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌
Prudhvi Raj Sukumaran

Updated on: Jun 25, 2022 | 8:08 PM

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌(Prithviraj Sukumaran)గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అక్కడ సూపర్ హిట్స్ లో నటించారు పృథ్వీరాజ్‌. తాజాగా ఆయన నటిస్తోన్న కడువా సినిమా టీజర్ నేడు రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు . ఈసందర్భంగా పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ.. ఆకస్తికర వ్యాఖ్యలు చేశారు. పృథ్వీరాజ్‌ నటించిన అయ్యప్పనుమ్ కోషియం సినిమా తెలుగులో భీమ్లానాయక్ గా రీమేక్ అయిన విషయం తెలిసిందే. అలాగే ఆయన దర్శకత్వం వహిచిన లూసిఫర్ సినిమా తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ అవుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ముందుగా గాడ్ ఫాదర్ సినిమాను డైరెక్ట్ చేయాలనీ ముందుగా పృథ్వీరాజ్‌ను సంప్రదించారట. కానీ పృథ్వీరాజ్‌ కమిట్ అయిన సినిమాలతో బిజీగా ఉండటంతో అదికుదరలేదట.

పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ..’హైదరాబాద్ లో జరిగిన ఇష్యూ తీసుకొని జనగణమన తీశాను మంచి ఆదరణ పొందింది. నాకు హైదరాబాద్ తో మంచి అనుభవం వుంది. ఇక్కడ సినిమాకు మంచి ఆదరణ వుంది.చిరంజీవి ‘లూసిఫర్‌’ రీమేక్‌ చేయడం ఆనందంగా ఉంది. చిరంజీవి ఇమేజ్‌కు సరిపోయే కథ ఇది. ఈ సినిమాకు నన్ను దర్శకత్వం వహించమని చిరు అడిగారు. కానీ నాకు కుదరలేదు. అంతకు ముందు ‘సైరా నరసింహ రెడ్డి’లో ఓ పాత్ర కోసం నన్ను సంప్రదించారు. అప్పుడూ చేయలేకపోయా.. ఆసమయంలో అబ్రాడ్ లో ఉండటం వల్ల కుదరాలేదు. భవిష్యత్తులో ‘లూసిఫర్‌ 2 కూడా తీస్తాను. ఈ సినిమాను కూడా చిరంజీవి రీమేక్‌ హక్కులు తీసుకుని డైరెక్షన్‌ చేయమని అడిగితే తప్పకుండా చేస్తాను’’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి