Pranitha Subhash: భర్తకు పాద పూజ చేసిన బాపు గారి బొమ్మ.. ట్రోలర్స్‌కు స్ట్రాంగ్‌ కౌంటరిచ్చిన ప్రణీత

ప్రణీత.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. నటించింది కొన్ని సినిమాల్లోనే అయినా తన అందం, అభినయంతో బాపు గారి బొమ్మగా పేరు తెచ్చుకుంది. అయితే సినిమా కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే 2021లో వ్యాపారవేత్త నితిన్‌ రాజును పెళ్లి చేసుకుంది. గతేడాది ఓ పాపకు కూడా జన్మనిచ్చింది.

Pranitha Subhash: భర్తకు పాద పూజ చేసిన బాపు గారి బొమ్మ.. ట్రోలర్స్‌కు స్ట్రాంగ్‌ కౌంటరిచ్చిన ప్రణీత
Pranitha Subhash

Updated on: Jul 19, 2023 | 3:46 PM

ప్రణీత.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. నటించింది కొన్ని సినిమాల్లోనే అయినా తన అందం, అభినయంతో బాపు గారి బొమ్మగా పేరు తెచ్చుకుంది. అయితే సినిమా కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే 2021లో వ్యాపారవేత్త నితిన్‌ రాజును పెళ్లి చేసుకుంది. గతేడాది ఓ పాపకు కూడా జన్మనిచ్చింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తోన్న ప్రణీత సోషల్‌ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటోంది. తన లేటెస్ట్‌ ఫొటోస్‌, వీడియోలను తరచూ షేర్‌ చేస్తుంటుంది. అలా తాజాగా ప్రణీత తన భర్తకు పాదపూజ చేస్తున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయగా.. అవి కాస్తా వైరలయ్యాయి. కొంతమంది నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. ఇంకా ఏ కాలంలో ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈక్రమంలో తనను ట్రోల్‌ చేస్తున్న వారికి గట్టి కౌంటర్‌ ఇచ్చింది ప్రణీత.

‘భీమన అమావాస్య’ ను పురస్కరించుకుని సంప్రదాయం ప్రకారం నా భర్తకు పాదపూజ చేశాను. ఏటా ఇలానే చేస్తాను. ఈ ఫొటోలను షేర్‌ చేసినందుకు గతంలో కూడా నాపై విమర్శలు వచ్చాయి. అలా నన్ను ట్రోల్‌ చేసేవారికి ఇది పితృస్వామ్య రాజ్యం, పురుషాధిక్య ప్రపంచంలా కనిపిస్తుందేమో. నాకు మాత్రం ఈ పూజ సనాతన ధర్మంలో ఒక భాగమే. దీనికి చాలా విశిష్టత ఉంది. ఇలాంటి పూజలకు సంబంధించిన ప్రాముఖ్యత, విశిష్టతను తెలియజేస్తూ ఎన్నో కథలు కూడా హిందూ పురాణాల్లో ఉన్నాయి. మన సంస్కృతిలో అందరి దేవతలను ఒకేలా పూజిస్తాం’అని ప్రణీత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ప్రస్తుతం రవణ అవతార్‌, దిలీప్‌ 148 అనే కన్నడ, మలయాళ భాషా సినిమాల్లో నటిస్తోంది ప్రణీత.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..