గత కొద్ది రోజులుగా చిత్రపరిశ్రమకు.. ఏపీ ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. టికెట్స్ రేట్స్ తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడం.. నియమాలు పాటించని థియేటర్లను క్లోజ్ చేయడం.. అలాగే ఐదవ షోను ప్రదర్శించకుండా నిబంధనలు జారీ చేయడంపై సినీ ప్రమనుఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, ఎస్ఎస్ రాజమౌళి, పోసాని, ఆర్ నారాయణ మూర్తి సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమై.. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చర్చించిన సంగతి తెలిసిందే. త్వరలోనే చిత్రపరిశ్రమ ఎదుర్కోంటున్న సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన భీమ్లా నాయక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రతి చోటా రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతున్నా.. ఏపీలో మాత్రం రాజకీయ రచ్చ కొనసాగుతుంది. భీమ్లా నాయక్ సినిమా విడుదలకు ముందే ఐదవ షోకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడంతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తక్కువ సినిమా టికెట్ ధరలతో సినిమాను ప్రదర్శించలేమంటూ ఇప్పటికే పలు థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ప్రభుత్వ తీరుపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా కోపాలు ఉంటే.. రాజకీయంగా చూసుకోవాలని… ఇలా సినిమా.. థియేటర్ల విషయంలో కాదని సూచిస్తున్నారు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు సైతం ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తాజాగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఏపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
“సృజన… సాంకేతికత మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటీ ? చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ మేమే ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా ? ఏవైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి.. కక్ష సాధింపులు బాక్సాఫీస్ దగ్గర ఎందుకు ? ఎంతగా ఇబ్బందిపెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డుకట్ట వేయలేరు ” అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. ఇక ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్ చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి.
#BheemlaNayak .. #GovtofAndhrapradesh please put an end to this onslaught..let cinema thrive ??????#JustAsking pic.twitter.com/eZxpVYYZbI
— Prakash Raj (@prakashraaj) February 27, 2022
Chiranjeevi : గ్యాంగ్‌లీడర్ మార్క్ మసాలా ఎంటర్‌టైనర్‌తో రానున్న మెగాస్టార్..?
Kodali Nani: బాబును వదిలి అన్నను నమ్ముకో.. పవన్ కల్యాణ్‌కు కొడాలి నాని సూచన..