MAA Elections 2021: ఆ విషయంలో మాకు అన్యాయం జరిగింది.. ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

|

Oct 09, 2021 | 5:21 PM

'మా' ఎన్నికల కథ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఇరు ప్యానల్స్ ఓట్లు దక్కించుకునేందుకు తమ ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నాయి.

MAA Elections 2021:  ఆ విషయంలో మాకు అన్యాయం జరిగింది.. ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
Prakash Raj
Follow us on

‘మా’ ఎన్నికల కథ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఇరు ప్యానల్స్ ఓట్లు దక్కించుకునేందుకు తమ ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆదివారం జూబ్లిహిల్స్‌ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో పోలింగ్ ఏర్పాట్లు పరిశీలించేందుకు వచ్చిన ప్రకాశ్ రాజ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి కానీ.. పోస్టల్ బ్యాలెట్ విషయంలో మాత్రం తమకు అన్యాయం జరిగిందని తెలిపారు.  పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లని చివర్లో లెక్కించమని అడిగామని.. ఎన్నికల అధికారి ఆ విషయంలో తప్పు చేశాడనే భావిస్తున్నట్లు చెప్పారు.  గతం కంటే ఈ సారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ‘మా’ సభ్యులు అందరూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రకాశ్ రాజ్ విజ్ఞప్తి చేశారు.

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌-‘మా’లో మొత్తం 925 మంది సభ్యులున్నారు. 883 మందికి రేపు ఓటు వేసే హక్కు ఉంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు పోలింగ్ జరుగుతుంది. ప్రతి ఓటరు 26 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం నుంచి కౌంటింగ్ జరగనుంది. మరి సభ్యుల పల్స్ ఎలా ఉంది? ‘మా’ రంగస్థలంలో ఎవరు ఎటువైపు? మా రాజ్‌ అంటూ ప్రకాష్ అంటూ జై కొడతారా? లేదంటే మంచు విష్ణుకే మార్కులు వేస్తారా? ఫిలింనగర్‌ సర్కిల్స్‌లోనే కాదూ తెలుగురాష్ట్రాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఈ వర్గం ఆ వర్గం అని తేడాలేదు.. అందరూ ‘మా’ ఎన్నికల్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.

Also Read:  ‘తెర’వెనుక రాజకీయం.. ఇప్పుడే మొదలైన అసలు సిసలు ‘మా’ యుద్ధం

ఇద్దరు దొంగల ప్రేమకథ.. వీరి స్టోరి సినిమాకు ఏ మాత్రం తక్కువ కాదు.. స్కెచ్‌లు కూడా నెక్ట్స్ లెవర్