టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజు రోజుకీ వేడెక్కుతుంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగా.. అభ్యర్థులు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. మా అధ్యక్ష పదవి కోసం సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, నటి హేమ, సీవిఎల్ పోటిపడుతున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో లోకల్, నాన్ లోకల్ అని.. ప్రకాష్ రాజ్ అధ్యక్షుడిగా పోటిచేయడం మాకు ఇష్టలేదంటూ కొందరు విమర్శించగా.. అందుకు ప్రకాష్ రాజ్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక ఇటీవల నటి హేమ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. మా అధ్యక్షుడిగా ఉన్న నరేష్.. నిధులు దుర్వినియోగం చేశారని.. ఎన్నికలు జరిపాలని కోరుతున్నట్లుగా తన సభ్యులకు పంపిన వాయిస్ మెసేజ్ వైరల్ అయ్యింది. దీంతో తనపై హేమ చేసిన ఆరోపణలను అవాస్తవం అని నరేష్ సీరియస్గా స్పందిస్తూ.. నిబంధనలను ఉల్లంఘించిన హేమపై చర్యలు తీసుకోవాలని మా క్రమశిక్షణ సంఘంకు ఫిర్యాదు చేశారు. దీంతో మా క్రమశిక్షణ సంఘం హేమకు నోటీసులు పంపింది.
అయితే మా ఎన్నికలలో అభ్యర్థులు చేస్తోన్న ఆరోపణలతో మా ప్రతిష్ట దిగజారుతుందని.. వెంటనే వారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని మెగాస్టార్ చిరంజీవి.. కృష్ణంరాజుకు బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో కొత్త చర్చకు దారి తీసింది. ఇవాళ ఆయన తన ట్విట్టర్ ఖాతాలో జెండా ఎగురవేస్తాం అంటూ ట్వీట్ చేశారు. అయితే రేపు (ఆగస్ట్ 15) స్వాతంత్ర దినోత్వవంను ఉద్దేశించి పెట్టి ఉండకపోవచ్చునని.. త్వరలో జరగబోతున్న మా ఎన్నికలలో తాము జెండా ఎగరేస్తామని ప్రకాష్ రాజ్ ధీమా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో సినీ పరిశ్రమలో మరోసారి ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్ అవుతుంది. గతంలో కూడా ప్రకాష్ రాజ్ పలు మార్లు మా ఎన్నికలపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. పది రోజలు క్రితం తెగేదాక లాగొద్దు అంటూ.. నెల క్రితం ఎలక్షన్స్ ఎప్పుడూ అంటూ ట్వీట్ చేసాడు.
ట్వీట్..
“జెండా” ఎగరేస్తాం ……
— Prakash Raj (@prakashraaj) August 14, 2021
Paagal Movie Review: అమ్మలాంటి ప్రేమ కోసం ‘పాగల్’ పాట్లు.. ఇంతకీ లవ్లో పాసవుతాడా!
Akkineni Sumanth: విడాకులు తీసుకున్న మోస్ట్ కన్ఫ్యూజ్డ్ మెన్.. మళ్లీ మొదలైందంటున్న సుమంత్..