
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. పలువురు సెలబ్రిటీలకు నోటీసులు పంపించి.. విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీనటుడు ప్రకాష్ రాజ్ బుధవారం సీఐడీ విచారణకు హాజరయ్యారు. సీఐడీ కార్యాలయంలో అధికారులు ఆయనను పలు కోణాల్లో ప్రశ్నించినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ నుంచి పొందిన పారితోషకం, కమిషన్ వ్యవహారాలపై ఆరా తీశారు. విచారణ తర్వాత బయటకు వచ్చి ప్రకాష్ రాజ్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినందుకు తనను క్షమించాలని కోరారు. మళ్లీ ఇలాంటిది రిపీట్ చేయనన్నారు. 2016లో ఓ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత ఆ బెట్టింగ్ యాప్.. 2017లో గేమింగ్ యాప్‌గా మారినట్లు వెల్లడించారు. దీంతో ఆ యాప్‌తో తాను చేసుకున్న ఒప్పందాన్ని అప్పుడే రద్దు చేసుకున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అప్పుడు ప్రియురాలిగా.. ఇప్పుడు స్పెషల్ సాంగ్.. చిరుతో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఇక ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో మంగళవారం నటుడు విజయ్ దేవరకొండను సీఐడీ అధికారులు గంటకుపైగా ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్‌ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీషన్లపై ఆరా తీసినట్టు సమాచారం. విచారణ అనంతరం సీఐడీ కార్యాలయం వెనుకగేటు నుంచి విజయ్ దేవరకొండ వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..
Bigg Boss 9 Telugu: సీన్ మారింది.. బిగ్‌బాస్ దుకాణం సర్దేయాల్సిందే.. ఓర్నీ మరి ఇంత అట్టర్‌ఫ్లాపా..
Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..