Salaar Movie: సలార్ నటికి యాక్సిడెంట్.. ముఖం నిండా గాయాలు.. వీడియో వైరల్..

కేజీఎఫ్ 1,2 తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా సలార్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గతేడాది డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టించిన ఈ మూవీ.. మొదటి రోజే పాన్ ఇండియా రికార్డ్స్ బద్దలుకొట్టింది. ఫస్ట్ డే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Salaar Movie: సలార్ నటికి యాక్సిడెంట్.. ముఖం నిండా గాయాలు.. వీడియో వైరల్..
Actress Pooja Vishweshwar

Updated on: Jan 07, 2024 | 10:06 AM

సలార్ సినిమా నటి పూజా విశ్వేశ్వర్‏కు యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలు కావడంతో ముఖమంతా రక్తంతో నిండిపోయింది. ఆమెను స్ట్రైచర్ పై అంబులెన్స్‏లోకి తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. వీడియో చూస్తుంటే.. ఆమె కంటి భాగం దగ్గర పెద్ద గాయం జరిగినట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలోని అనకాపల్లి హైవేపై వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయి డివైడర్ ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఆమె తర్వగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ ప్రమాదంలో ఆమెకు సలార్ సినిమాతో క్రేజ్ సంపాదించుకుంది పూజా విశ్వేశ్వర్. విశాఖపట్నంకు చెందిన పూజా… తెలుగులో పలు చిత్రాల్లో నటించారు. గాడ్ ఫాదర్, టైగర్ నాగేశ్వరరావు చిత్రాల్లో కనిపించారు. కానీ సలార్ సినిమాతోనే పాపులర్ అయ్యారు.

సలార్ చిత్రంలోని ఓ ఫైట్ సీన్ లో.. చిన్నపిల్లపై విలన్ బలత్కారం చేయబోతే హీరో ప్రభాస్ వచ్చి కాపాడతాడు. మంచి బ్యా్గ్రౌండ్ మ్యూజిక్ తో వచ్చే ఈ యాక్షన్ సీన్ సినిమాకు హైలెట్ అయ్యింది. అందులో విలన్ పక్కన కళ్లద్దాలు పెట్టుకుని కనిపిస్తుంది పూజా. “రెండు నిమిషాలు బావా.. దొరసానిలా తయారుచేస్తా” అని ఆమె చెప్పగానే.. “రెండు నిమిషాలు.. దొరలా తయారు చేస్తా” అంటూ ప్రభాస్ డైలాగ్ చెప్పడం హైలేట్ అయ్యింది. దీంతో పూజా మరింత ఫేమస్ అయ్యారు.

కేజీఎఫ్ 1,2 తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా సలార్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గతేడాది డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టించిన ఈ మూవీ.. మొదటి రోజే పాన్ ఇండియా రికార్డ్స్ బద్దలుకొట్టింది. ఫస్ట్ డే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.  ఈ సినిమాలోని ఓ ఫైట్ సీన్లో కనిపించిన పూజా తన డిఫరెంట్ స్టైల్ తో ఆకట్టుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.