Salaar: తన హెల్త్ పై అప్డేట్ ఇచ్చిన ‘సలార్’ విలన్.. నొప్పితో పోరాటం చేస్తోన్ననంటున్న పృథ్వీరాజ్..

|

Jun 27, 2023 | 5:41 PM

ఇందులో ప్రభాస్ జోడిగా శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.. అలాగే ఇందులో మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే ఇటీవలే తన సినిమా చిత్రీకరణ సమయంలో ప్రమాదానికి గురయ్యారు పృథ్వీ. దీంతో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయని.. రెండు రోజుల క్రితం సర్జరీ జరిగినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా తన హెల్త్ అప్డేట్ ను సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు పృథ్వీ.

Salaar: తన హెల్త్ పై అప్డేట్ ఇచ్చిన సలార్ విలన్.. నొప్పితో పోరాటం చేస్తోన్ననంటున్న పృథ్వీరాజ్..
Prithviraj Sukumaran
Follow us on

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న సినిమా సలార్. ఇప్పటికే కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో సెన్సెషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమా ఎప్పుడెప్పుడు వస్తోందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. భారీ బడ్జెట్.. అంతకు మించిన అంచనాల మధ్య రూపొందుతున్న ఈమూవీ ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో ప్రభాస్ జోడిగా శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.. అలాగే ఇందులో మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే ఇటీవలే తన సినిమా చిత్రీకరణ సమయంలో ప్రమాదానికి గురయ్యారు పృథ్వీ. దీంతో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయని.. రెండు రోజుల క్రితం సర్జరీ జరిగినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా తన హెల్త్ అప్డేట్ ను సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు పృథ్వీ.

“నేను విలయత్ బుద్ధ సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాను. అదృష్ణవశాత్తూ.. నాకు కీలకమైన శస్త్రచికిత్సను నిపుణుల సమక్షంలో జరిగింది. ప్రస్తుతం నేను రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకుంటాను. అలాగే ఫిజియోథెరపీ కూడా జరుగుతుంది. నేను నొప్పితో పోరాటం చేసి సాధ్యమైనంత త్వరగా బౌన్స్ బ్యాక్ అవుతాను. నా ఆరోగ్యం పట్ల ఆందోళన చెంది.. నాపై ప్రేమను వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అంటూ తన  ఓ నోట్ రిలీజ్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. పృథ్వీరాజ్ పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 2 నుంచి 3 నెలలపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం పృథ్వీరాజ్ చేతిలో అనేక ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆడు జీవితం, బడే మియాన్ చోటే మియాన్, ప్రాజెక్ట్ L2, సలార్ చిత్రాల్లో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.