Yogi Movie: ప్రభాస్ ఓరోరి యోగి ఒరిజినల్ సాంగ్ చూశారా..? నవ్వులు పూయిస్తున్న మీమ్స్
2007లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. ఈసినిమా తల్లి కొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రభాస్ నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే అంతకు ముందే అమ్మ సెంటి మెంట్ తో ప్రభాస్ ఛత్రపతి అనే సినిమా చేశారు. ఆతర్వాత వెంటనే యోగి సినిమా కూడా అదే కాన్సెప్ట్ తో తెరకెక్కడంతో..

యోగి .. ప్రభాస్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 2007లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. ఈసినిమా తల్లి కొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రభాస్ నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే అంతకు ముందే అమ్మ సెంటి మెంట్ తో ప్రభాస్ ఛత్రపతి అనే సినిమా చేశారు. ఆతర్వాత వెంటనే యోగి సినిమా కూడా అదే కాన్సెప్ట్ తో తెరకెక్కడంతో ప్రేక్షకులకు అంతగా రీచ్ కాలేకపోయింది ఈ సినిమా. ఇటీవలే ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు.
థియేటర్స్ లో డైరెక్ట్ గా రిలీజ్ చేసినప్పుడురాని రెస్పాన్స్ ఇప్పుడు రీ రిలీజ్ కు వచ్చింది. అంతే కాదు యోగి రీ రిలీజ్ లో కలెక్షన్ కూడా భారీగా వచ్చిందని తెలుస్తోంది. యోగి సినిమాకు రమణ గోగుల సంగీతం అందించారు. ఈ సినిమాలో పాటలకు అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా మంచి క్రేజ్ ఉంది.
ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ఓరోరి యోగి నన్ను కొరికెయ్రో అంటూ సాగే సాంగ్ బాగా పాపులర్ అయ్యింది ఈ సాంగ్ లో ప్రభాస్ తో ముమైత్ ఖాన్ స్టెప్పులేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ పాట ఒరిజినల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
కన్నడలో ఈ సాంగ్ ఓ లవ్ సాంగ్. పైగా దేవుడి మీద ఉంటుంది ఆపాట. దాన్ని మనవాళ్ళు ఏకంగా స్పెషల్ సాంగ్ చేసి మన సినిమాలో కాపీ చేశారు. ఇప్పుడు దీని పై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
యోగి సాంగ్ ను కన్నడ సాంగ్ ను కలిసి ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్. సోషల్ మీడియాలో ఈ వీడియోలు నవ్వులు పూయిస్తున్నాయి. ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ఆయన వరుసగా సినిమాలను లైనప్ చేసి బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సలార్, కల్కీ, మారుతి డైరెక్షన్ లో ఓ సినిమా, సందీప్ వంగ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ప్రభాస్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.