Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‏కు ఇక పునకాలే.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న సలార్ వర్కింగ్ స్టిల్స్..

|

Oct 23, 2022 | 6:46 PM

సలార్ చిత్రం నుంచి డార్లింగ్ వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేసి.. ఫ్యాన్స్‏కు ఫుల్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ప్రభాస్ మాసీ లుక్ చూసి ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. ఆ పిక్స్ మీరు చూసేయ్యండి.

Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‏కు ఇక పునకాలే.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న సలార్ వర్కింగ్ స్టిల్స్..
Prabhas Salaar Stills
Follow us on

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు నేడు. దేశవ్యాప్తంగా డార్లింగ్ బర్త్ డే సెలబ్రెషన్స్ గ్రాండ్‏గా సెలబ్రెట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. మరోవైపు ప్రభాస్ తదుపరి చిత్రాల నుంచి వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తూ… అభిమానులను ఖుషి చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె సినిమాల నుంచి క్రేజీ పోస్టర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సలార్ మూవీ నుంచి డార్లింగ్ వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ప్రభాస్ మాస్ లుక్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.

సలార్ చిత్రయూనిట్ రిలీజ్ చేసిన ఫోటోలలో ప్రబాస్ మాసీ లుక్‏లో చెమటలు చిందిస్తూ కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. చాలా కాలం తర్వాత డార్లింగ్ ఇలా ఫుల్ మాస్ అండ్ యాక్షన్ మూడ్‏లో కనిపించడంతో సలార్ మూవీ ఇంకా ఏ రెంజ్‏లో ఉంటుందన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను హోంబలే ఫిల్స్మ్ నిర్మిస్తుండగా.. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవే కాకుండా ప్రభాస్ చేతిలో ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ చిత్రాలున్నాయి. ఇందులో ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ చిత్రం. మరోవైపు డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కె శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.