The RajaSaab: ఏమున్నాడ్రా బాబు..! రాజా సాబ్ నుంచి క్రేజీ అప్డేట్.. పుట్టిన రోజున

|

Oct 21, 2024 | 5:23 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమా కోసం.. ప్రేక్షకులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సలార్, కల్కి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.

The RajaSaab: ఏమున్నాడ్రా బాబు..! రాజా సాబ్ నుంచి క్రేజీ అప్డేట్.. పుట్టిన రోజున
therajasaab
Follow us on

ప్రభాస్‌ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. అందరి స్టార్లను మించిపోయిన స్టార్. నార్త్ ఈస్ట్ అని తేడా లేకుండా… కటౌట్‌ ఉంటే చాలు.. కోట్లు వచ్చి పడేలా చేసే కెపాసిటీ ఉన్న స్టార్. అలాంటి ఈ స్టార్ హీరో సినిమాలపై అందరి చూపు ఉంటుంది. అయితే కల్కి తర్వాత ప్రభాస్ చేస్తున్న రాజా సాబ్‌ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. టైర్ 2 హీరోలను డైరెక్ట్ చేసిన మారుతి ఇప్పుడు ప్రభాస్ ను ఎలా చూపిస్తాడు. అసలు ఈ సినిమా కథ ఏంటి అనేది ఇప్పుడు అస్కతికరంగా మారింది. కాగా రాజా సాబ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సాలిడ్ అప్డేట్ లేదు. అప్పుడెప్పుడో ప్రభాస్ లుంగీ జట్టుకున్న పోస్టర్.. ఆతర్వాత ప్రభాస్ సూట్ లో కనిపించిన చిన్న వీడియో వదిలారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి : విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి భార్య అరాచకం.. సోషల్ మీడియా షేక్ అవుతుందిగా..

ఇక ప్రభాస్ హీరీగా మారుతీ డైరెక్షన్లో తెరెకెక్కుతున్న సినిమా రాజాసాబ్‌. ప్రభాన్ తన రూట్‌ మార్చి మరీ.. హర్రర్ కామెడీ జోనర్లో ఈ సినిమాతో మన ముందుకు వస్తున్నారని టాక్. రీసెంట్‌గా తన ఫ్యాన్ ఇండియా లుక్స్‌ ను కూడా రిలీజ్ చేసిన ప్రభాస్.. తన లుక్స్‌తో.. అక్రాస్ సోషల్ మీడియా వైబ్స్ అయితే క్రియేట్ చేశారు. ప్రభాస్ ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపించనున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు. ఆ రోజున ప్రభాస్ నటించిన సినిమాల నుంచి క్రేజీ అప్డేట్స్ రానున్నాయి. అలాగే రాజా సాబ్ నుంచి టీజర్ రిలీజ్ అవ్వనుందని తెలుస్తోంది. ఈమేరకు తాజాగా మేకర్స్ ప్రభాస్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అలాగే ఈ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది.. ఈ హీరోయిన్ టక్కరిదొంగ ముద్దుగుమ్మా..! ఎంతగా మారిపోయింది.!!

రాజా సాబ్‌ సినిమాలో.. ప్రభాస్‌కు జోడిగా చాలా మంది ముద్దుగుమ్మలు కనిపించనున్నారు. మాళవిక మోహన్, నిధి అగర్వాల్ తో పాటు మరికొంతమంది కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది, మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.