చాలా ఏళ్ల నుంచి ఏడాదికి ఒక సినిమానే చేస్తున్నాడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్. అయితే 2023లో మాత్రం ఆశ్చర్యకరంగా ప్రభాస్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత 2024లో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక 2025లోనూ ప్రభాస్ రెండు సినిమాలు విడుదలవుతాయని అభిమానులు ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే డార్లింగ్ తదుపరి సినిమాల లైనప్ కూడా ఉంది. కల్కి తర్వాత ప్రభాస్ నటించిన హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ది రాజా సాబ్’. ఏప్రిల్ 10న సినిమాను విడుదల చేయనున్నట్టు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. చిత్ర బృందం స్వయంగా ఈ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. అయితే ఇప్పుడీ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కు మరింత సమయం అవసరమైన ది రాజా సాబ్ సినిమా విడుదలను వాయిదా వేసే యోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్ ఎక్కువగా ఉపయోగించారని తెలుస్తోంది. ఇదే క్రమంలో తొందరపడి సినిమాను విడుదల చేయకూడదనే అభిప్రాయం మేకర్స్ లో ఉందని సమాచారం. దీంతో అనుకున్న తేదీ కంటే కనీసం మూడు నెలలు ఆలస్యంగా ‘ది రాజా సాబ్’ సినిమా విడుదలవుతుందని టాక్ వినిపిస్తోంది.
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్ ‘ది రాజా సాబ్’ సినిమాలో ప్రభాస్ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఆడియో వేడుకను జపాన్‌లో గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్రబృందం ప్లాన్ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పాటలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని సంగీత దర్శకుడు ఎస్ థమన్ తెలిపారు.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలా సినిమాలున్నాయి. ‘ది రాజా సాబ్ తో పాటు, ‘కల్కి 2’, ‘సలార్ 2’, హను రాఘవపూడి, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రాలతో పాటు హోంబాలే నిర్మించనున్న రెండు చిత్రాల్లో ప్రభాస్ నటించనున్నాడు.
Royal by blood……
Rebel by choice….
Claiming what was always his! 🔥🔥Motion Poster out now.https://t.co/v1dhha0Wxa#HappyBirthdayPrabhas ❤️#Prabhas #TheRajaSaab pic.twitter.com/cZyLxeRNez
— The RajaSaab (@rajasaabmovie) October 23, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.