
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అదిరిపోయే కామ్ బ్యాక్ ఇచ్చారు. దాదాపు ఆరేళ్లుగా సరైన హిట్ లేక సతమతం అయిన ప్రభాస్ ఓకే ఒక్క సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు చూపించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన మొదటి పార్ట్ భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా వసూల్ చేసింది. 2023లో భారీ విజయం సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే కలెక్షన్స్ లోనూ 600కోట్లకు పైగా వసూల్ చేసింది సలార్ సినిమా. ఇదిలా ఉంటే తాజాగా సలార్ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలన విజయం సాధించింది.
తాజాగా నైజం లో నయా రికార్డ్ క్రియేట్ చేసింది సలార్ సినిమా.. నైజం లో 100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి సెన్సేషనల్ రికార్డ్ ను క్రియేట్ చేసింది సలార్. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు ఓ అదిరిపోయే పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికి కూడా థియేటర్స్ దగ్గర సలార్ సినిమా హవా కొనసాగుతోంది. తాజాగా నైజం లో రికార్డ్ క్రియేట్ చేయడంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సలార్ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ అంతకు మించి యాక్షన్ ఎపిసోడ్స్ తో సలార్ సినిమాను తెరకెక్కించాడు. సలార్ మొదటి పార్ట్ ఘనవిజయం సాదించడమతొ ఇప్పుడు సెకండ్ పార్ట్ పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. మరి సెకండ్ పార్ట్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈసినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు.
𝑲𝒉𝒂𝒏𝒔𝒂𝒂𝒓… 𝑰’𝒎 𝑺𝒐𝒓𝒓𝒚!
Unstoppable #SalaarCeaseFire has crossed a massive ₹ 𝟔𝟐𝟓 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐁𝐎𝐂 (worldwide) 💥#SalaarBoxOfficeStorm #RecordBreakingSalaar #SalaarRulingBoxOffice #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan… pic.twitter.com/JFgqX99Ojv
— Salaar (@SalaarTheSaga) January 1, 2024
𝗧𝗛𝗘 𝗗𝗜𝗡𝗢𝗦𝗔𝗨𝗥 𝗦𝗖𝗢𝗥𝗘𝗦 𝗔 𝗚𝗜𝗚𝗔𝗡𝗧𝗜𝗖 𝗕𝗟𝗢𝗖𝗞𝗕𝗨𝗦𝗧𝗘𝗥 ❤️🔥❤️🔥#BlockbusterSalaar crosses the 𝟏𝟎𝟎 𝑪𝑹𝑶𝑹𝑬 𝑮𝑹𝑶𝑺𝑺 in Nizam 🔥🔥
– https://t.co/N5FRW6NoU6Nizam Release by @MythriOfficial 💥#Salaar #SalaarCeaseFire#Prabhas #PrashanthNeel… pic.twitter.com/xlPeEg1mZn
— Mythri Movie Makers (@MythriOfficial) January 5, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి