Salaar: ప్రభాస్ సలార్‌కు ఓవర్సీస్‌లో దిమ్మతిరిగే ఆఫర్.. ఎన్ని కోట్లంటే

|

Mar 25, 2023 | 4:29 PM

ప్రభాస్ చివరిగా నటించిన రాధేశ్యామ్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఫ్యాన్స్ ప్రభాస్ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

Salaar: ప్రభాస్ సలార్‌కు ఓవర్సీస్‌లో దిమ్మతిరిగే ఆఫర్.. ఎన్ని కోట్లంటే
Prabhas Salaar
Follow us on

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ చివరిగా నటించిన రాధేశ్యామ్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఫ్యాన్స్ ప్రభాస్ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా బడా సినిమాలను కమిట్ అయ్యి ఆయా సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. వీటిలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ యమా పవర్ ఫుల్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాలార్ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది.

ఇదిలా ఉంటే సలార్ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సలార్ ఈ ఏడాది సెప్టెంబర్ నెల 28వ తేదీన రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఊహించని రేంజ్ లో డిమాండ్ జరుగుతోందట.

తాజాగా సలార్ మూవీ ఓవర్సీస్ బిజినెస్ డీల్ సెట్ అయ్యిందట. ప్రస్తుతం ఓవర్సీస్ లో 75 కోట్ల రూపాయల నుంచి 80 కోట్ల రూపాయల ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ తర్వాత ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 3, ఎన్టీఆర్ సినిమా చేయనున్నాడు.