ప్రభాస్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. దేశంలోని ప్రస్తుత పరిస్థితులలో ఓమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతుండడంతో సినిమా వాయిదా వేస్తున్నట్లుగా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు మేకర్స్.
We have to postpone the release of our film #RadheShyam due to the ongoing covid situation. Our sincere thanks to all the fans for your unconditional love and support.
We will see you in cinemas soon..!#RadheShyamPostponed pic.twitter.com/aczr0NuY9r
— UV Creations (@UV_Creations) January 5, 2022
సంక్రాంతి ముందు పెద్ద చిత్రాలకు ఓమిక్రాన్ ఎఫెక్ట్ ఎక్కువగానే తగిలింది. దేశంలో ఓమిక్రాన్, కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో నైట్ కర్య్ఫ్యూ.. నిబంధనలు అమలవుతున్నాయి. అలాగే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయి. దీంతో విడుదలకు సర్వం సిద్ధం చేసుకుని రెడీగా ఉన్న భారీ బడ్జెట్ చిత్రాలు వెనకడుగు వేస్తున్నాయి. ఇప్పటికే పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ వాయిదా పడిన సంగతి తెలసిందే. తాజాగా ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమాను సైతం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని తెలిపారు మేకర్స్. దీంతో రాధేశ్యామ్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో ప్రభాస్ విక్రమాధిత్య పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన రాధేశ్యామ్ ట్రైలర్ యూట్యూబ్లో రికార్డ్స్ సృష్టిస్తోంది.
Also Read: Perni Nani vs RGV: వర్మ ప్రశ్నలకు పేర్ని నాని కౌంటర్ ఎటాక్.. ఏ చట్టం చెప్పిందంటూ..
Bellamkonda Sreenivas : స్పీడ్ పెంచిన బెల్లం కొండ హీరో.. ఛత్రపతి హిందీ రీమేక్ టాకీ పార్ట్ పూర్తి