Tollywood: పక్కా ప్లానింగ్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న బడా సినిమాలు..

|

Mar 07, 2022 | 7:12 AM

రిలీజ్ డేట్‌ల విషయంలోనే కాదు... ప్రమోషన్‌ల విషయంలోనూ మన హీరోలు సర్దుకు పోతున్నారు. భారీ చిత్రాల మధ్య కనీసం రెండు వారాల గ్యాప్‌ ఉండేలా పక్కాగా ప్లాన్ చేసుకున్న మేకర్స్‌.

Tollywood: పక్కా ప్లానింగ్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న బడా సినిమాలు..
Prabhas Radhe Shyam Ntr Ram
Follow us on

Tollywood: రిలీజ్ డేట్‌ల విషయంలోనే కాదు.. ప్రమోషన్‌ల విషయంలోనూ మన హీరోలు సర్దుకు పోతున్నారు. భారీ చిత్రాల మధ్య కనీసం రెండు వారాల గ్యాప్‌ ఉండేలా పక్కాగా ప్లాన్ చేసుకున్న మేకర్స్‌… ఇప్పుడు ప్రమోషన్ యాక్టివిటీస్ విషయంలోనూ అంతే పర్ఫెక్ట్ స్ట్రాటజీతో సినిమాలను ఆడియన్స్‌ ముందుంచుతున్నారు.మొన్నటి వరకు ఎక్కడ చూసినా భీమ్లా నాయక్ సందడే. పవర్ స్ట్రామ్‌ రెడీ టు హిట్ ద సిల్వర్‌ స్క్రీన్స్ అంటూ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా మోత మోగిపోయింది. ఈ సినిమా ప్రమోషన్ ఫుల్ స్వింగ్‌లో ఉన్న టైమ్‌లో మరే మూవీకి సంబంధించి ఇండస్ట్రీలో బజ్‌ కూడా వినిపించలేదు. రెండు వారాల్లో రిలీజ్‌కు రెడీ అవుతున్న రాధేశ్యామ్ మేకర్స్‌ కూడా భీమ్లా జోరుకు అడ్డు రాకుండా సైలెంట్‌గా ఉండిపోయారు.

భీమ్లా నాయక్ అలా రిలీజ్ అయ్యిందో లేదో.. వెంటనే రాధేశ్యామ్‌ మేకర్స్‌ బరిలో దిగారు. కొత్త ట్రైలర్‌ ను రిలీజ్ చేయటంతో పాటు వరుస ప్రెస్‌మీట్‌లతో హల్చల్ చేస్తున్నారు. అంతేకాదు సినిమాను న్యూస్‌లో ఉంచేందుకు స్ట్రాటజిక్‌గా ఇంట్రస్టింగ్ పాయింట్స్‌ను రివీల్ చేస్తూ వస్తున్నారు. దర్శక నిర్మాతలతో పాటు ప్రభాష్, పూజా హెగ్డే కూడా ఫుల్‌ టైమ్‌ రాధేశ్యామ్ ప్రమోషన్‌ మీదే ఉంటున్నారు. మరో 20 రోజుల్లో రిలీజ్‌కు రెడీ అవుతున్న ట్రిపులార్ టీమ్ మాత్రం ప్రజెంట్ సైలెంట్‌ మోడ్‌లోనే ఉంది. రాధేశ్యామ్ రిలీజ్‌ వరకు ఇదే సైలెన్స్‌ మెయిన్‌ చేస్తారట ట్రిపులార్ మేకర్స్‌. వన్స్ రాధేశ్యామ్ ఆడియన్స్ ముందుకు రాగానే… ఇక ట్రిపులార్ టైమ్‌ స్టార్ట్ అవుతుంది.

ఆల్రెడీ ప్రమోషన్‌లోనూ మాస్టర్ అన్న పేరున్న రాజమౌళి.. 14 రోజుల వ్యవధిను పర్ఫెక్ట్‌గా యుటిలైజ్ చేసుకునేలా ప్లాన్ రెడీ చేశారు. దుబాయ్‌తో పాటు ముంబై, చెన్నైలలో మెగా ఈవెంట్స్‌ ప్లాన్ చేస్తున్నారు ట్రిపులార్ మేకర్స్‌. రాజమౌళి తో పాటు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్, అలియా భట్‌, అజయ్‌ దేవగన్‌, శ్రియ కూడా ప్రమోషన్‌లో పాల్గొనేలా ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇలా ప్రమోషన్‌ టైమ్‌లోనూ ఒక సినిమాతో మరో సినిమాకు క్లాష్‌ రాకుండా చూసుకుంటున్నారు మన మేకర్స్‌.

 మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss Non Stop: బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ నుంచి ముమైత్‌ ఖాన్‌ ఎలిమినేట్‌.. బయటికొచ్చాక ఏం చెప్పిందంటే..

Radhe Shyam: ప్రభాస్‌ సినిమా ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది.. రాధేశ్యామ్ సినిమా ఎలా ఉందంటే!..

Ram Charan: మెగా పవర్‌స్టార్‌కు బాహుబలి కాజా.. డైరెక్టర్‌ శంకర్‌కు కూడా.. నెట్టింట్లో వైరల్‌ గా మారిన ఫొటోలు..