Radhe Shyam: రికార్డుల మోత మోగిస్తున్న రాధేశ్యామ్.. పదిరోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..

|

Mar 22, 2022 | 9:25 AM

దేశంలోనే భారీ బడ్జెట్ సినిమాల్లో రాధే శ్యామ్ ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందమైన లొకేషన్లు, గ్రిప్పింగ్ స్టోరీ లైన్, లీడ్ పెయిర్స్  ప్రభాస్- పూజహెగ్డేల మధ్య కెమిస్ట్రీ అన్ని కలిపి తెరపై మ్యాజిక్ క్రియేట్ చేశాయి.

Radhe Shyam: రికార్డుల మోత మోగిస్తున్న రాధేశ్యామ్.. పదిరోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..
Radhe Shyam
Follow us on

Radhe Shyam: దేశంలోనే భారీ బడ్జెట్ సినిమాల్లో రాధే శ్యామ్ ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందమైన లొకేషన్లు, గ్రిప్పింగ్ స్టోరీ లైన్, లీడ్ పెయిర్స్  ప్రభాస్(Prabhas)- పూజహెగ్డే(Pooja Hegde)ల మధ్య కెమిస్ట్రీ అన్ని కలిపి తెరపై మ్యాజిక్ క్రియేట్ చేశాయి. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పిరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందింది. లెజెండరీ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తన వాయిస్ ఓవర్ తో ఇవ్వగా.. టాప్ నాచ్ స్పెషల్ ఎఫెక్ట్స్, ఇటలీ, జార్జియా, హైదరాబాద్‌లలోని సుందరమైన విజువల్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.  ఈ చిత్రంలో ప్రభాస్ హస్తసాముద్రికుడి పాత్రలో కనిపించాడు. ప్రభాస్ మరియు పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ ప్రేషకులను విపరీతంగా అలరించింది. డార్లింగ్ స్టైలిష్ లుక్స్ ఫ్యాన్స్ ను ఫిదా చేశాయి. ఈ సినిమా డివైడ్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ వసూళ్ల పరంగా రికార్డుల మోత మోగిస్తుంది. ఈ సినిమాకు భారీ ఓపినింగ్స్ దక్కాయి.

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదల ద్వారా 200 కోట్లకు పైగా వసూలు చేసింది అలాగే థియేట్రికల్ హక్కుల ద్వారా 200 కోట్లకు పైగా వసూలు చేసింది. మొత్తంగా ఈ చిత్రం విడుదలైన 10 రోజుల్లోనే 400 కోట్లకు పైగా వసూలు చేసి నయా రికార్డును క్రియేట్ చేసింది. సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్ శాటిలైట్, డిజిటల్,  మ్యూజిక్‌తో సహా దాని నాన్-థియేట్రికల్ రైట్స్ వరకు భారీగా బిజినెస్ జరిగింది. ట్విస్ట్‌తో కూడిన ఈ అందమైన ప్రేమకథ తెరపైకి రాకముందే భారీ మొత్తాన్ని వసూలు చేసింది. ఈ చిత్రం విడుదల కాకముందే శాటిలైట్, డిజిటల్ హక్కుల నుండి 200 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని వసూలు చేసింది. ఇక ప్రభాస్ ప్రస్తుతం తాను కమిట్ అయినా సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అలాగే మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మన పాన్ ఇండియా స్టార్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shabaash Mithu: సచిన్, ధోని తర్వాత మరో లెజండరీ క్రికెటర్‌ బయోపిక్.. టీజర్‌ దుమ్మురేపుతోంది..!

Viral Photo: క్యూట్ బుజ్జాయి.. చిలిపి చిన్నారి.. ఈ ఫోటోలోని పాప ఇప్పుడు కుర్రాళ్లకు ఫేవరెట్ హీరోయిన్.! ఎవరో గుర్తుపట్టారా!

Ajith Valimai: ఇక ఓటీటీలో సందడి చేయనున్న అజిత్.. బ్లాక్ బస్టర్ వలిమై స్ట్రీమింగ్ ఎప్పుడంటే..