Prabhas : ప్రభాస్- నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కే’ అప్‌డేట్.. సినిమాకు అవే హైలైట్ కానున్నాయట..

|

Dec 10, 2021 | 3:47 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైన్ లో పెట్టిన సినిమాలన్నీ భారీ సినిమాలే.. వరుసగా సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు ఈ స్టార్ హీరో.

Prabhas : ప్రభాస్- నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే అప్‌డేట్.. సినిమాకు అవే హైలైట్ కానున్నాయట..
Prabhas
Follow us on

Prabhas :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైన్ లో పెట్టిన సినిమాలన్నీ భారీ సినిమాలే.. వరుసగా సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు ఈ స్టార్ హీరో. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేసాడు ప్రభాస్ ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా బుట్టబొమ్మ పూజాహెగ్డే నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సలార్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతోపాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రామాయణం నేపథ్యంలో ఉండనుందట. ఈ సినిమాలో ప్రభాస్ రాముడుగా కనిపించనుండగా.. కృతి సనన్ సీతగా నటిస్తుంది.

ఈ సినిమాలతోపాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్ ప్రాజెక్ట్ కే అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే మొదలైంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్, దీపికా పదుకొనె నటిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. శుక్రవారం నుంచి ప్రభాస్ సెట్ లో జాయిన్ అవ్వనున్నాడట. ప్రభస్ పై పలు కీలక సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తున్నట్టుగా తెలిసింది. ఇవి సినిమాకు ప్రధాన హైలైట్గా నిలుస్తాయని చెబుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

 Ram Gopal Varma: మంచు లక్ష్మి ఫోటో షేర్ చేస్తూ వర్మ కామెంట్స్.. ఆర్టిస్టిక్ కిల్లర్‏నే అంటూ..

Bigg Boss 5 Telugu: సిరి పై షణ్ముఖ్ అలక.. నువ్వంటే నాకు చాలా ఇష్టమంటూ హగ్గు.. మళ్లీ మొదలెట్టేశారుగా..

Bheemla nayak: రన్‌ టైమ్‌ను లాక్‌ చేసుకున్న భీమ్లా నాయక్‌.. సినిమా నిడివి ఎంతంటే!