Mirchi Movie : 13 ఏళ్ల క్రితం బ్లాక్ బస్టర్.. ప్రభాస్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా రాజాసాబ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన ప్రభాస్.. ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ చిత్రాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా డార్లింగ్ నటించిన మిర్చి సినిమా నెట్టింట ట్రెండ్ అవుతుంది.

Mirchi Movie : 13 ఏళ్ల క్రితం బ్లాక్ బస్టర్.. ప్రభాస్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..
Mirchi Movie

Updated on: Feb 08, 2026 | 1:57 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. ఇటీవల సంక్రాంతి పండగ సందర్భంగా రాజా సాబ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు డార్లింగ్. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. మరోవైపు స్పిరిట్, ఫౌజీ చిత్రాల్లో నటిస్తున్నారు ప్రభాస్. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ నటించిన మిర్చి సినిమా పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. 2013 ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. అప్పట్లో ఈ సినిమా మాస్ అడియన్స్ ను ఓ రేంజ్ లో ఊపేసింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ముఖ్యంగా ప్రభాస్ అభిమానులకు పిచ్చెక్కించింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : అందంలో రాజహంస.. 47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్.. ఆత్మస్థైర్యానికి నిలువెత్తు రూపం..

యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా అనుష్క నటించింది. అలాగే మరో హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ కనిపించింది. ఈ సినిమా విడుదలై ఈరోజుకు 13 సంవత్సరాలు పూర్తైంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి మిర్చి పేరు నెట్టింట మారుమోగుతుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో నటించిన హీరోయిన్స్ గురించి సెర్చ్ చేస్తున్నారు. ఇందులో నటించిన అనుష్క ఇంకా సినిమాల్లో కొనసాగుతుంది. కానీ రిచా గంగోపాధ్యాయ మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది. గతంలో రానా హీరోగా నటించిన లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఎక్కువ మంది చదివినవి : Love Song : నిజంగా ఏం పాట బాసూ.. 1999 నుంచి ట్రెండింగ్.. ప్రేమికులకు చాలా స్పెషల్ సాంగ్..

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లీడర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ తర్వాత రవితేజ సరసన మిరపకాయ్, నాగవల్లి, సారొచ్చారు వంటి సినిమాల్లోనూ కనిపించింది. అందం, అభినయంతో మెప్పించినప్పటికీ ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు. 2013లో చివరిసారిగా భాయ్ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత ఇండస్ట్రీకి గుడ్ పై చెప్పేసి తన స్నేహితుడు పోర్ట్‌లాండ్‌కు చెందిన జో లాంగేల్లాను పెళ్లి చేసుకుంది. 2021లో వీరికి బాబు జన్మించాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.

ఎక్కువ మంది చదివినవి : Krishnavamshi : నేను తీసిన సినిమాల్లో ఆ రెండే చెత్త సినిమాలు.. డైరెక్టర్ కృష్ణవంశీ..

ఎక్కువ మంది చదివినవి : Actress : మల్లీశ్వరీ సినిమా నేను చేయకుండా ఉండాల్సింది.. నటి కామెంట్స్..