Prabhas: ఇదెక్కడి పిచ్చి రా బాబు.. జై రెబల్ స్టార్ అంటూ చేయి కోసి ప్రభాస్ ఫోటోకు రక్త తిలకం.. చివరకు..

ఇక థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. ప్రభాస్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి పూలదండలు వేసి.. పాలాభిషేకాలు.. కొబ్బరికాయలు కొట్టి, టపాసులు పేల్చి సంబరాలు జరుపుతున్నారు. జై శ్రీరామ్ అనే నినాదాలతో దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్స్ మారుమోగుతున్నాయి. అయితే కొన్నిచోట్ల అభిమానం శ్రుతిమించిపోయింది. సినిమా ఆలస్యంగా ప్రదర్శించారని థియేటర్ అద్దాలు పగలకొట్టారు ఫ్యాన్స్.

Prabhas: ఇదెక్కడి పిచ్చి రా బాబు.. జై రెబల్ స్టార్ అంటూ చేయి కోసి ప్రభాస్ ఫోటోకు రక్త తిలకం.. చివరకు..
Adipurush

Updated on: Jun 16, 2023 | 4:58 PM

ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆదిపురుష్ మొత్తానికి థియేటర్లలోకి వచ్చేసింది. గత రెండు రోజుల నుంచే ప్రభాస్ ఫ్యాన్స్ సందడి మొదలుపెట్టారు. ఈ సినిమా రిలీజ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూశారు ప్యాన్స్. అభిమానుల నిరీక్షణ ఫలించి ఎట్టకేలకు జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాకు ఉదయం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇక థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. ప్రభాస్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి పూలదండలు వేసి.. పాలాభిషేకాలు.. కొబ్బరికాయలు కొట్టి, టపాసులు పేల్చి సంబరాలు జరుపుతున్నారు. జై శ్రీరామ్ అనే నినాదాలతో దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్స్ మారుమోగుతున్నాయి. అయితే కొన్నిచోట్ల అభిమానం శ్రుతిమించిపోయింది. సినిమా ఆలస్యంగా ప్రదర్శించారని థియేటర్ అద్దాలు పగలకొట్టారు ఫ్యాన్స్.

ఇక మరోక చోట హనుమకు కేటాయించిన సీట్లో కూర్చున్నాడని ఓ వ్యక్తిపై దాడి చేశారు. అనంతరం థియేటర్ సిబ్బంది కల్పించుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత ఆ వ్యక్తి మరో సీట్లో కూర్చోబెట్టారు. ఇదిలా ఉంటే.. ఓ యువకుడి థియేటర్ వద్ద మరింత అతి చేశారు. జై రెబల్ స్టార్ అంటూ అరుస్తూ.. ప్రభాస్ పోస్టర్ ముందు నిలబడి బీర్ బాటిల్ తో చేయి కోసుకున్నాడు. తన రక్తంతో ప్రభాస్ నుదుటన తిలకం దిద్దాడు. అప్పటికీ బీర్ బాటిల్ ను పక్కన పడేయకుండా మళ్లీ మళ్లీ కట్ చేసుకుంటూనే ఉన్నాడు. అయితే అక్కడున్నవాళ్లు సైతం అతడిని ఆపకుండా వీడియోస్ తీస్తూ జైరెబల్ స్టార్ అంటూ అరుస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. అతడిది అభిమానం కాదని.. పిచ్చి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించారు. ఇందులో కృతి సనన్ జానకిగా.. రావణగా సైఫ్ నటించారు. ఇక హనుమ పాత్రలో సన్నీ సింగ్ నటించగా.. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో భారీ ఎత్తున నిర్మించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.