Karthikeya 2: ‘కార్తికేయ 2’ పై పాన్ ఇండియా స్టార్ ప్రశంసలు.. ఆనందంలో తేలిపోతున్న నిఖిల్

|

Aug 17, 2022 | 2:40 PM

యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయన్ 2. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సూపర్ హిట్ సినిమా కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Karthikeya 2: కార్తికేయ 2 పై పాన్ ఇండియా స్టార్ ప్రశంసలు.. ఆనందంలో తేలిపోతున్న నిఖిల్
Prabhas
Follow us on

యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయన్ 2(Karthikeya 2). చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సూపర్ హిట్ సినిమా కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అంతే కాకుండా నార్త్ లోనూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా ఇప్పటికే బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది. కార్తికేయ 2 సినిమా సక్సెస్ అవ్వడంతో షోస్ కూడా పెంచుతున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే కార్తికేయ 2కు సినిమా తారలు విషెస్ తెలుపుతున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ ఈ సినిమా పై ప్రశంశలు కురిపించగా తాజాగా మరో స్టార్ హీరో చిత్రయూనిట్ ను తెగ పొగిడేశారు. అంత పెద్ద స్టార్ కార్తికేయ 2 సినిమాను పొగడటంతో చిత్రయూనిట్ తెగ ఆనంద పడిపోతున్నారు.

ఇంతకు ఆ స్టార్ హీరో ఎవరో కాదు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ పేరు ఇప్పుడు కేవలం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. ఈ పాన్ ఇండియా స్టార్ తాజాగా కార్తికేయ 2 సినిమాను వీక్షించారు. సినిమా సూపర్ హిట్ సాధించడంతో చిత్రయూనిట్ పై ప్రశంశలు కురిపించారు. ‘‘హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ , డైరెక్టర్ చందు మొండేటి, యాక్టర్ అనుపమ్ ఖేర్, కాల భైరవ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ స‌హా బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన ఎంటైర్ కార్తికేయ 2 టీమ్‌కి అభినంద‌న‌లు’’ అంటూ ప్ర‌భాస్ పోస్ట్ చేశారు. దీని పై హీరో నిఖిల్ స్పందిస్తూ.. ప్రభాస్ భాయ్ మీ విషెష్ కు కృతజ్ఞతలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..