Prabhas: ప్రభాస్ అభిమానులకు ఇంట్రెస్టింగ్ అప్డేట్.. డార్లింగ్ సినిమా రిలీజ్ పై డిస్ట్రిబ్యూటర్స్ కీలక నిర్ణయం…

|

Oct 17, 2022 | 7:26 PM

వర్షం, బిల్లా సినిమాలను బిగ్ స్క్రీన్ పై ప్రదర్శించనున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లో కూడా బిల్లా సినిమా 4 కె వెర్షన్ విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ లో బిల్లా 4కె స్పెషల్ షోలపై డిస్ట్రిబ్యూటర్స్ పోస్టర్ విడుదల చేశారు.

Prabhas: ప్రభాస్ అభిమానులకు ఇంట్రెస్టింగ్ అప్డేట్.. డార్లింగ్ సినిమా రిలీజ్ పై డిస్ట్రిబ్యూటర్స్ కీలక నిర్ణయం...
Prabhas
Follow us on

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా స్టార్ హీరోస్ పుట్టిన రోజు సందర్భంగా వారి కెరీర్‏లో హిట్ అయిన సినిమాలను తిరిగి 4కెలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, మహేష్ బాబు బర్త్ డేస్ స్పెషల్ పలు చిత్రాలను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే గతంలో కంటే ఇప్పుడు ఈ సినిమాలకు ఊహించని స్థాయిలో కలెక్షన్లు రావడం విశేషం. ఇక ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందడి మొదలైంది. డార్లింగ్ బర్త్ డే స్పెషల్ పలు చిత్రాలను రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్. వర్షం, బిల్లా సినిమాలను బిగ్ స్క్రీన్ పై ప్రదర్శించనున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లో కూడా బిల్లా సినిమా 4 కె వెర్షన్ విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ లో బిల్లా 4కె స్పెషల్ షోలపై డిస్ట్రిబ్యూటర్స్ పోస్టర్ విడుదల చేశారు.

అక్టోబర్ 22న సాయంత్రం 6 గంటలకు.. అలాగే రాత్రి 9.30 నిమిషాలకు బిల్లా మూవీ ప్రదర్శించనున్నట్లుగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అధికారికంగా దృవీకరించారు. వీటితోపాటు.. అనేక ప్రదర్శనలు త్వరలోనే జత చేయున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన అనుష్క శెట్టి, నమిత హీరోయిన్లుగా నటించగా.. మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. కృష్ణం రాజు, హన్సిక, కెల్లీ దోర్జీ కీలకపాత్రలలో కనిపించగా…మణిశర్మ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తుండగా.. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తున్నారు. అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. మారుతి డైరెక్షన్లలలో రావాల్సిన చిత్రాలు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. ఇక ఇప్పుడు డార్లింగ్ చేతిలో ఉన్న సినిమాలు భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు కావడంతో ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అలాగే.. డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమా విడుదల కానుంది.