యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం.. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్.. ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. స్పిరిట్… ప్రాజెక్ట్ కే.. సలార్ చిత్రాలు షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. వీటితోపాటు.. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న సినిమా ఆదిపురుష్ (Adipurush). ఇందులో డార్లింగ్ సరసన కృతి సనన్ నటిస్తుండగా.. మరో స్టా్ర్ సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు.
తాజాగా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.. అంతేకాకుండా.. ఈ చిత్రాన్ని 3D వెర్షన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్రాఫిక్స్‌కు మేకర్స్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాను జపనీస్ ఫిలిం మేకర్ యుగో సాకో రూపొందించిన ప్రిన్స్ ఆఫ్ లైట్ మూవీ చూసిన తరువాతే రామాయణ కథను ఈతరానికి చెప్పాలనే ఉద్ధేశ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఇటీవల చెప్పుకొచ్చారు డైరెక్టర్ ఓంరౌత్.
#Adipurush
Worldwide Theatrical Release in 3D on 12th Jan 2023.#Prabhas #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @RETROPHILES1 #ShivChanana #TSeries pic.twitter.com/ozGRZPRiQR— Om Raut (@omraut) March 1, 2022
Also Read: Radhe Shyam: ప్రభాస్ అభిమానులకు మరో సర్ప్రైజ్.. రాధేశ్యామ్ ప్రమోషన్స్ షూరు అయ్యేది అప్పుడే..
Samantha: రష్యా దాడులపై స్పందించి నటి సమంత.. ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్.