Adipurush Om Raut: ఆదిపురుష్ దర్శకుడికి అదిరిపోయే లగ్జరీ కారు.. గిఫ్ట్ గా ఇచ్చింది ఎవరో తెలుసా..?

రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

Adipurush Om Raut: ఆదిపురుష్ దర్శకుడికి అదిరిపోయే లగ్జరీ కారు.. గిఫ్ట్ గా ఇచ్చింది ఎవరో తెలుసా..?
Adipurush Director Om Raut

Updated on: Oct 19, 2022 | 12:18 PM

ప్రస్తుతం సినిమా  అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఆదిపురుష్ తో ప్రభాస్ మొదటిసారి బాలీవుడ్ దర్శకుడితో పని చేస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమానుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాదు అనే విమర్శలను కూడా మూటగట్టుకుంది. ఈ టీజర్ లో ఎక్కువగా గ్రాఫిక్స్ మాత్రమే కనిపించింది.ప్రభాస్ కు సంబంధించిన కొన్ని షాట్స్ కూడా గ్రాఫిక్స్ తో కనిచేశారన్న విమర్శలు కూడా వినిపించాయి. అంతే కాదు రామాయణాన్ని తప్పుగా చూస్పితున్నారని, సినిమాలో నటుల వేషధారణ పై కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈక్రమంలోనే విడుదల చేసిన త్రీడి టీజర్ కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. త్రీడీలో టీజర్ చూసిన ప్రేక్షకులు సినిమా నెక్స్ట్ లెవల్లో ఉండబోతుందని కామెంట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ ఓ కాస్ట్లీ గిఫ్ట్ అందుకున్నారు. ఆదిపురుష్ సినిమాను టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ క్రమంలో ఇప్పుడు దర్శకుడు ఓం రౌత్ కు ఓ ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చారు నిర్మాత భూషణ్ కుమార్. సుమారు రూ. 4.02 కోట్ల విలువ చేసే ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో కారును ఆదిపురుష్ దర్శకుడు గిఫ్ట్ గా అందుకున్నాడు. గతంలోనూ నిర్మాత భూషణ్ పలువురు సినిమా తరాలకు ఖరీదైన కారులను గిఫ్ట్ గా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

Adipurush .director

ఇక ఈ సినిమాలో రాఘవగా ప్రభాస్.. జానకిగా కృతి సనన్.. లంకేశ్ గా సైఫ్ అలీఖాన్.. లక్ష్మణ్ గా సన్నీ సింగ్ కనిపించనున్నారు. ఆదిపురుష్ సినిమాను సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలాగే త్రీడి ఫార్మేట్ లో ఈ సినిమాను తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి