Pawan Kalyan: ‘వకీల్ సాబ్’ డైరెక్టర్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన పవర్ స్టార్.. అదేంటంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ళ తర్వాత చేసిన సినిమా వకీల్ సాబ్ . బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ మూవీకి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది

Pawan Kalyan: వకీల్ సాబ్ డైరెక్టర్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన పవర్ స్టార్.. అదేంటంటే..
Pawan

Updated on: Dec 24, 2021 | 4:12 PM

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ళ తర్వాత చేసిన సినిమా వకీల్ సాబ్ . బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ మూవీకి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. చాలా కాలం తరువాత పవర్ స్టార్ ను బిగ్ స్క్రీన్ మీద చూసిన అభిమానులు  ఆనందానికి అవదులులేవు. ఇక వకీల్ సాబ్ సినిమాలో పవన్ పవర్ ఫుల్ లాయర్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తన దర్శకులకు స్నేహితులకు ప్రతి సమ్మర్ లో ఆయన తోట నుంచి మామిడి పళ్ళను గిఫ్ట్స్ గా ఇస్తాడన్న విషయం తెలిసిందే.

తాజాగా వేణు శ్రీరామ్ కు స్పెషల్ గిఫ్ట్ పంపించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. క్రిస్మస్ సందర్భగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పంపించిన గిప్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ స్పెషల్ గిఫ్ట్ ను వేణు శ్రీరామ్ భార్య  గాయత్రీ శ్రీరామ్ ఓపెన్ చేసి అందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తూ ఓ వీడియో చేశారు. ఈ సందర్భంగా పవన్ సతీమణి అన్నా లెజనోవాతో పాటు పవన్ కల్యాణ్ కు గాయత్రీ అభినందనలు తెలిపారు. ఇప్పుడు ఈవీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shyam Singha Roy Review: స్క్రీన్‌ మీద కలర్‌ఫుల్‌గా శ్యామ్‌ సింగరాయ్‌.. నాని మూవీ రివ్యూ..

Pushpa Movie: అల్లు అర్జున్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. పుష్ప సక్సెస్ మీట్ క్యాన్సిల్.. ఎందుకంటే..

Radhe Shyam: రాధేశ్యామ్ స్టోరీ అదేనంటా ?.. ఇప్పుడిదే నెట్టింట హాట్ టాపిక్..