Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా దుమారాన్ని రేపుతున్నాయి. సినిమా ఇండస్ట్రీని ఏపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురించేస్తుందని పవన్ విమర్శించారు. అంతే కాకుండా ఏపీ మంత్రులపై పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక పవన్ వ్యాఖ్యలను తప్పు పడుతూ పలువురు మంత్రులు.. సినిమా ప్రముఖులు ప్రెస్ మీట్‌లతో హడావిడిసి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వారికి ట్వీట్స్ ద్వారా కౌంటర్లు వేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ‘పాలసీ ఉగ్రవాదం’కి అన్ని రంగాలు అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమయింది” అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అలాగే ‘ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి.. హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వై.సి.పి. పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం. ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు? అంటూ ట్వీట్ లో విరుచుకుపడ్డారు పవన్.
తాజాగా మరో ట్వీట్ చేశారు పవన్.. స్నాప్‌షాట్‌లో వైసీపీ ప్రభుత్వం చేసిన ఉగ్రవాద విధానానికి ఉదాహరణలు. అంటూ ఒక ఫోటోను షేర్ చేశారు. పవన్ ఎపిసోడ్‌పై వైసీపీ మంత్రులు ఒంటికాలిపై లేచారు. పవన్ సినిమాటిక్ డైలాగ్స్‌కు పొలిటికల్ పవర్ పంచ్‌లతో కౌంటర్లు వేశారు. ముఖ్యంగా పేర్ని నాని ఇంచ్ టూ ఇంచ్ పంచ్ టూ పంచ్ హైవోల్టేజ్ సమాధానాలు ఇచ్చారు. ఇది ఒక పార్ట్. తర్వాత ఇదే ఎపిసోడ్‌లోకి పోసాని ఎంట్రీ ఇచ్చారు. అప్పుడే మూవీ మరో రేంజ్‌కు వెళ్లింది. తనదైన శైలిలో పవన్‌పై విరుచుకుపడ్డారు పోసాని. వ్యక్తిగత విషయాలు మొదలు పెట్టి పొలిటికల్ ఇష్యూస్ వరకూ చాలా మాట్లాడారు. ఆ తర్వాత పవన్ ఇలా వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.. వైసీపీ గ్రామసింహాలు అంటూ సెటైర్లు పేల్చారు.. అటు నుంచి కూడా అదే రేంజ్‌లో ట్వీట్లు. కాసేపు సీన్ ట్విట్టర్‌కు షిఫ్ట్ అయింది. ఆ తర్వాత సీన్‌లోకి పవన్ ఫ్యాన్స్ వచ్చారు.
Examples of Policy terrorism by YCP Govt in a snapshot.#SaveAPfromYSRCP pic.twitter.com/P0TnSkOuKw
— Pawan Kalyan (@PawanKalyan) September 28, 2021
Examples of Policy terrorism by YCP Govt in a snapshot.#SaveAPfromYSRCP pic.twitter.com/P0TnSkOuKw
— Pawan Kalyan (@PawanKalyan) September 28, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :