Bheemla Nayak : భీమ్లానాయక్ వాయిదా తప్పదా..? రిలీజ్ కోసం మరో తేదీని లాక్ చేసేపనిలో మేకర్స్.?

|

Jan 22, 2022 | 6:46 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతర్వాత ఆయన మూవీకోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Bheemla Nayak : భీమ్లానాయక్ వాయిదా తప్పదా..?  రిలీజ్ కోసం మరో తేదీని లాక్ చేసేపనిలో మేకర్స్.?
Follow us on

Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతర్వాత ఆయన మూవీకోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు సినిమాలతో సిద్ధంగా ఉన్నారు. ఒకటి దగ్గుబాటి రానాతో కలిసి చేస్తున్న భీమ్లానాయక్, మరొకటి క్రిష్ దర్శకత్వంలో హరిహార వీరమల్లు. వీటిలో భీమ్లానాయక్ సినిమా ముందు ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది.. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. అలాగే రానా మరో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు డైలాగులు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రాస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్స్ , పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమాలో పవన్ సరసన టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ నటిస్తుండగా.. రానా కు జోడీగా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తుంది.

ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూసారు మేకర్స్. కానీ ఆర్ఆర్ఆర్ బరిలో ఉండటంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. ఈ క్రమంలో 2022 ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూశారు. ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పిన తేదీకి విడుదల చేయడం సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ లో సినిమాను తీసుకురావాలని చూస్తున్నారట. అయితే అదే సమయంలో మెగాస్టార్ ఆచార్య సినిమా రిలీజ్ ఉంది. అలాగే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా కూడా ఏప్రిల్ లోనే రిలీజ్ కానుంది. దాంతో భీమ్లా నాయక్’ సినిమా విడుదల కోసం మరో తేదీని లాక్ చేయాలని చూస్తున్నట్లు టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: బూరెబుగ్గల బుజ్జాయి.. చిరునవ్వులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.?

Nagashaurya: కృష్ణ వ్రింద విహారి అంటోన్న నాగశౌర్య.. బర్త్ డే వేళ స్పెషల్ సర్‏ప్రైజ్..

Manchu Lakshmi: తెలంగాణ ప్రభుత్వానికి మంచు లక్ష్మీ రిక్వెస్ట్.. ఎందుకంటే..