పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలకు కమిట్ అయిన విషయం తెలిసిందే.. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ త్వరలో హరి హర వీరమల్లు గా రాబోతున్నాడు. అలాగే అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ను కూడా రెడీ చేస్తున్నాడు. అయితే పవన్ కమిట్ అయినా సినిమాలే కాకుండా మరో కొన్ని సినిమాలను కూడా లైన్ లో పెడుతున్నాడని తెలుస్తుంది. అయితే ఇలా వరుసగా సినిమాలను ఓకే చేస్తున్న పవన్ కు టైం సరిపోతుందా అన్న డౌట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే సినిమాలతోపాటు రాజకీయాల్లో కూడా పవన్ బిజీగా వున్నారు. అయితే సినిమాలను అయన జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేయాలనీ చూస్తున్నాడని తెలుస్తుంది. గతంలో మాదిరిగా ఒక్కో సినిమా ఏడాది పాటు కాకుండా కొన్ని వారాల వ్యవధిలోనే ముగించేయాలనేది పవన్ ప్లాన్ గా చెబుతున్నారు. ప్రతి సినిమా కూడా చాలా తక్కువ రోజులు షూటింగ్ తో ప్లాన్ చేస్తున్నారు.
అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ కోసం పవన్ కేవలం 40 వర్కింగ్ డేస్ మాత్రమే ఇచ్చాడని సమాచారం. ఇక క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమాను కూడా తక్కువ డేట్లతోనే ముగించేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే క్రిష్ 50 శాతం సినిమా షూటింగ్ ను ముగించాడని టాక్. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా విషయంలోనూ పవన్ అదే స్పీడ్ ను మెయింటెన్ చేయబోతున్నాడు. ఈ మూవీ కేవలం 60 రోజుల వర్కింగ్ డేస్ తో ముగించబోతున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే జులై లేదా ఆగస్టులో ప్రారంభించి ఏకథాటిగా సినిమా పూర్తి అయ్యే వరకు షూటింగ్ కొనసాగించబోతున్నారట.ఇక అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ను ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. క్రిష్ హరిహర వీరమల్లు సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :