Boyapati: మాస్ ఫ్యాన్స్ పల్స్ తెలిసిన దర్శకుల్లో ముందువరసలో ఉంటారు బోయపాటి శ్రీను. రవితేజ హీరోగా వచ్చిన భద్ర సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బోయపాటి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజను ను సరికొత్తగా చూపించారు బోయపాటి. ఆతర్వాత ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక బాలయ్య తో కలిసి బోయపాటి తెరకెక్కించిన సింహ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. బాలయ్య కేరీర్ లో మరో మైలు రాయిగా నిలిచింది. అలాగే ఈ సినిమా తర్వాత లెజెండ్ అంటూ రచ్చ చేశాడు బోయపాటి మరో సారి బాలయ్య హీరోగా లెజెండ్ సినిమా చేశాడు ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక రీసెంట్ గా అఖండ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు బోయపాటి. బాలయ్య తో సినిమాలు చేస్తూ హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు బోయపాటి . ఇదిలా ఉంటే ఇప్పుడు బోయపాటి ఎవరితో సినిమా చేయనున్నాడన్న ఆసక్తి ఏర్పడింది. అయితే అల్లు అర్జున్ తో బోయపాటి సినిమా ఉంటుందని ఈమధ్య వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు మరో హీరో వేరు వినిపిస్తుంది. మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ తో తప్ప మరో హీరోతో సినిమా చేయలేదు బోయపాటి. ఇప్పుడు మెగా హీరో తో బోయపాటి సినిమా చేస్తున్నాడట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బోయపాటి సినిమా చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో పవన్ కోసం బోయపాటి ఒక పవర్ఫుల్ స్టోరీని రెడీ చేశాడట. మాస్ యాక్షన్ తో పాటు పొలిటికల్ టచ్ ఉండే కథను సిద్ధం చేశాడట బోయపాటి. మరి ఈ కథను పవన్ ఓకే చేస్తే సినిమా ఉంటుందని తెలుస్తుంది. చూడాలి మరి ఎం జరుగుతుందో..
మరిన్ని ఇక్కడ చదవండి :