Bheemla Nayak Song: నిమ్మళంగా కనపడే నిప్పుకొండ.. సెభాష్ భీమ్లా నాయకా… టైటిల్ సాంగ్ అదుర్స్..

Pawan Kalyan Birthday: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ సినిమా భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన

Bheemla Nayak Song: నిమ్మళంగా కనపడే నిప్పుకొండ.. సెభాష్ భీమ్లా నాయకా... టైటిల్ సాంగ్ అదుర్స్..
Bheemla Nayak Ott

Updated on: Sep 02, 2021 | 1:58 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న లెటేస్ట్ సినిమా భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్‏గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందిస్తున్నాడు. ఇందులో పవన్ సరసన నిత్య మీనన్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియో గ్లింప్స్‎ సినిమాపై అంచనాలను పూర్తిగా పెంచడమే కాకుండా.. సోషల్ మీడియాలో రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. తాజాగా ఈరోజు పవన్ పుట్టినరోజు కానుకగా.. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ విడుదల చేసింది చిత్రయూనిట్.

ఉద్యమకారుడి పొగరతడు.. కవి కలానికున్న ఆవేశం అతడు.. ! వారియర్‌ కత్తికున్న పదునతడు.. పేలిన తూటాకున్న వేగం అతడు.. !.. రైతు నాగలి కొనతడు..! అంజనా పుత్రుడు..! చిరు సోదరుడు.. ! కోట్ల మంది ఇలవేల్పుడు..! పవన్‌ కళ్యాణ్ నామధేయుడు..   ఇక గత కొద్ది రోజుల క్రితమే.. పవన్ పుట్టిన రోజు కానుకగా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనుహ్యంగా బర్త్ డేకు ఒక్కరోజు ముందే.. భీమ్ల నాయక్ టైటిల్ సాంగ్ లిరికల్ షీట్‌ను రిలీజ్ చేసి అభిమానులకు సర్‏ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం అందించగా.. థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ఇక తాజాగా విడుదలైన సాంగ్ అదిరిపోయింది. ఆడాగాడు.. ఈడాగాడు.. అమీరోళ్ల మేడాగాడు గుర్రంనీల్ల గుట్టకాడ.. బెమ్మాజెముడు చెట్టున్నాది.. సెభాష్ భీమ్ల నాయక్ అంటూ వచ్చే సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటుంది.

వీడియో..

 

భీమ్లా నాయక్‌.. ఇరగదీసే ఈడీ ఫైరు సల్లగుండ.. ఖాకీ డ్రెస్సు పక్కనపెడితే వీడే పెద్ద గుండా..నిమ్మళంగా కనపడే నిప్పుకొండ.. ముట్టుకుంటే తాటలేసిపోద్ది తప్పకుండా.. అంటూ సాగే ఈ పాట.. భీమ్లా నాయక్‌ పుట్టుక, అతని క్యారెక్టర్‌ ఏంటో తెలియజేస్తుంది.  ఈ పాటను  రామజోగయ్య శాస్త్రి రాయగా.. రామ్ మిరియాల, పృథ్వి చంద్ర, శ్రీకృష్ణ పాడారు.  తమన్ లైవ్ మ్యూజిక్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. అన్నింటికీ మించి పాటలో లిరిక్స్ అదిరిపోయాయి.

ట్వీట్..

Also Read: Jr.NTR: జక్కన్న నన్ను అసహ్యంగా ఉన్నావు అన్నారు.. ఆసక్తికర విషయాలను చెప్పిన ఎన్టీఆర్..

Nayanthara: కాబోయే భర్త నయన్‌ను ఏమని పిలుస్తాడో తెలుసా? అదే లేడీ సూపర్‌స్టార్ కొత్త సినిమా టైటిల్