Poonam Kaur: విడాకుల అంశంపై సంచలన పోస్ట్ పెట్టి.. వెంటనే డిలీట్ చేసిన పూనమ్ కౌర్

|

Nov 08, 2021 | 7:14 PM

ప్రముఖ నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఆమె వేసే ప్రతి ట్వీట్‌పై, పెట్టే ప్రతి పోస్ట్‌పై నెటిజన్లు నిగూడార్థాలు వెతుకుతూ ఉంటారు. 

Poonam Kaur: విడాకుల అంశంపై సంచలన పోస్ట్ పెట్టి.. వెంటనే డిలీట్ చేసిన పూనమ్ కౌర్
Poonam Kaur
Follow us on

ప్రముఖ నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఆమె వేసే ప్రతి ట్వీట్‌పై, పెట్టే ప్రతి పోస్ట్‌పై నెటిజన్లు నిగూడార్థాలు వెతుకుతూ ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను, తన అభిప్రాయాలను ఫాలోవర్స్‌తో, ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటారు పూనమ్.  తాజాగా ఈ నటి వేసిన ఓ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తాజాగా విడాకుల అంశంపై ప్రశ్నలను లేవనెత్తారు పూనమ్.

“విడాకుల అనంతరం నిజంగా మగవారికి పెయిన్ ఉండదా? లేదంటే..ఆడవాళ్లే ఇబ్బందులు పెడతారు..ఆడవాళ్లే వారిని మాటలతో బాధిస్తారు..వారి వల్లే మగవారికి కఠిన పరిస్థితులు వస్తుంటాయని ఈ సొసైటీ పక్షపాత ధోరణితో ప్రొజెక్ట్ చేస్తుందా.. ఇప్పటికీ మనం విడాకుల అంశాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగామా? విడాకుల కోణంపై మనకు కచ్చితమైన దృక్కోణం ఉందా?” అని పూనమ్ రాసుకొచ్చింది.

అయితే ఈ ట్వీట్‌ వేసిన గంటకే దాన్ని డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది. అసలు ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేసింది..? ఎందుకు డిలీట్ చేసింది..? విడాకుల అంశంపై ఇంత లోతైన పోస్ట్ పెట్టి డిలీట్ చేయడం పట్ల ఆంతర్యం ఏంటన్నది అర్థం కావడం లేదు.

Also Read: Samantha: ‘నీలాంటి వ్యక్తి లైఫ్‌లో ఉండటం నా అదృష్టం’… సమంత ఎమోషనల్ పోస్ట్

ముంగిస, నాగుపాము మధ్య భీకర యుద్ధం.. చూస్తే గుండెలు హడల్