Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం..

సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమార్తె, సింగర్ భవతారిణి కన్నుమూశారు. ఆమె వయస్సు 47 సంవత్సరాలు. కొంతకాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. భవతారిణి పలు సినిమాల్లో పాటలు పాడటం ద్వారా మంచి గుర్తింపు సాధించారు.

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం..
Ilaiyaraaja with daughter Bhavatharini
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 25, 2024 | 9:55 PM

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట విషాదం జరిగింది. అనారోగ్యంతో ఆయన కూతురు, గాయకురాలు భవతరణి కన్నుమూశారు. ఆమె క్యాన్సర్​తో​ పోరాడుతూ కన్నుమూసినట్లు తమిళ మీడియా వర్గాల ద్వారా తెలిసింది. గత కొంతకాలంగా భవతరణి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. తాజాగా పరిస్థితి విషమించడం వల్ల శ్రీలంకలోని ఓ ప్రైవైట్​ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయినా ఫలితం దక్కలేదు.  ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి గురువారం ఆమె కన్నుమూశారు.జనవరి 26 సాయంత్రం ఆమె భౌతికకాయం చెన్నైకి రానున్నట్లు తెలిసింది. అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమె మరణవార్త తెలిసిన తమిళ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రియులు కూడా నెట్టింట్లో ఇళయరాజా కుటుంబ సభ్యులకు సానుభూతి తెలలుపుతున్నారు

కాగా, భవతారిణి పలు తమిళ చిత్రాల్లో సాంగ్స్ కూడా పాడారు. ఎక్కువగా తన తండ్రి, సోదరుల సంగీత సారథ్యంలోనే ఎక్కువగా పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘భారతి’ సినిమాలోని ‘మయిల్ పోల పొన్ను ఒన్ను’ అనే తమిళ సాంగ్‌కు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డు పొందారు సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఇద్దరు కుమారులు కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా కూడా ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?