KS Sethumadhavan: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ మృతి..

గత కొద్ది రోజులుగా సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖులు

KS Sethumadhavan: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ మృతి..
Ks Sethumadhavan

Updated on: Dec 24, 2021 | 9:52 AM

గత కొద్ది రోజులుగా సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖులు అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్, గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి.. తమిళ హాస్య నటుడు వివేక్ ఇలా ఎంతో మంది సినీ ప్రముఖులు మరణించారు. ఇప్పుడు మరోసారి సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. దక్షిణ భారత ప్రముఖ డైరెక్టర్ కెఎస్. సేతు మాధవన్ కన్నుమూశారు. వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్న సేతు మధావన్ చెన్నైలోని నివాసంలో తుది శ్వాస విడిచారు. సేతు మాధవన్ వయసు ప్రస్తుతం 90 సంవత్సరాలు. సేతు మాధవన్ మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

కఎస్ సేతు మాధవన్ 1961లో మలయాళంలో దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత తమిళ్, కన్నడ, హిందీ భాషలలో 60కి పైగా చిత్రాలను తెరకెక్కించారు. ఇక తెలుగులో 1995లో వచ్చిన స్త్రీ సినిమాకు దర్శకత్వం వహించారు సేతు మాధవన్. కేరళలోని పాలక్కడ్ లో 1931లో జన్మించిన సేతు మాధవన్ పూర్తి పేరు కే. సుబ్రహ్మణ్యం సేతు మాధవన్. ఆయనకు భార్య వల్సాల, పిల్లలు సోను కుమార్, ఉమ, సంతోష్ సేతు మాధవన్ ఉన్నారు. 1991లో మరుపక్కమ్ అనే తమిళ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. సేతు మాధవన్ మృతిపై తమిళ్, మలయాళ చిత్రపరిశ్రమలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశాయి.

Also Read: Radhe Shyam Trailer: ప్రాణం పోసే ప్రేమ ప్రాణం తీయగలదా.. రాధేశ్యామ్ ట్రైలర్ అదుర్స్..

Thaggedhe Le: ‘తగ్గేదే లే’ డైలాగ్ చెప్పిన క్రికెటర్ జడేజా.. పుష్ప ఫీవర్ మాములుగా లేదుగా..

Pushpa: యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన శ్రీవల్లి సాంగ్‌.. 100 మిలియన్ల వ్యూస్‌ను దాటేసి..