Pooja Hegde: కేవలం దాని కోసమే నేను ఇండస్ట్రీలోకి రాలేదు.. బుట్టబొమ్మ ఇంటెస్టింగ్ కామెంట్స్

ఈ ఏడాది పూజకు అంతగా కలిసి రాలేదు. స్టార్ హీరోల సినిమాల్లో నటించినా అవి డిజాస్టర్స్ గా మిగిలాయి. తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించిన రాధేశ్యామ్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

Pooja Hegde: కేవలం దాని కోసమే నేను ఇండస్ట్రీలోకి రాలేదు.. బుట్టబొమ్మ ఇంటెస్టింగ్ కామెంట్స్
Pooja Hegde

Updated on: Dec 22, 2022 | 5:53 PM

ఒకప్పుడు లక్కీ హీరోయిన్స్ ఇప్పుడు బ్యాడ్ లక్ సఖీ అను పేరుతెచ్చుకుంటున్నారు. ఎడాది చాలా మంది హీరోయిన్ల పరిస్ధితి అదే. స్టార్ హీరోయిన్స్ గా రాణించిన ముద్దుగుమ్మ ఇప్పుడెవరుస ఫ్లాప్ లు అందుకుంటున్నారు. ఈ లిస్ట్ లో అందాల భామ పూజాహెగ్డే కూడా ఒకరు. ఈ ఏడాది పూజకు అంతగా కలిసి రాలేదు. స్టార్ హీరోల సినిమాల్లో నటించినా అవి డిజాస్టర్స్ గా మిగిలాయి. తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించిన రాధేశ్యామ్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత తమిళ్ స్టార్ దళపతి విజయ్ తో సినిమా చేసింది పూజ నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన బీస్ట్ సినిమా కూడా ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఆ తర్వాత తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, చరణ్ నటించిన ఆచార్య సినిమాలో చేసింది. ఈ సినిమా దారుణంగా ప్రేక్షకులను నిరాశపరిచింది.

దాంతో ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లో చేసిన సర్కస్ సినిమా పైనే ఆశలు పెట్టుకుంది. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమాను రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా పూజ హెగ్దే మాట్లాడుతూ.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. అయితే పూజ నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పటికీ ఈ చిన్నదానికి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. దాంతో పూజా రెమ్యునరేషన్ పెంచేసిందని ప్రచారం జరిగింది.

ఇవి కూడా చదవండి

దీనిపై పూజ స్పందిస్తూ.. రేమ్యూనరేషన్ కోసం నిర్మాతలను తాను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని చెప్పుకొచ్చింది. నేను రెమ్యూనరేషన్ పెంచానని అందరూ అనుకుంటున్నారు.. నిజానికి నేను ఎలాంటి రెమ్యూనరేషన్ పెంచలేదని నిర్మాతల దగ్గర అడ్వాన్సులు కూడా తీసుకోలేదని తెలిపింది. రెమ్యునరేషన్ కోసమే ఇండస్ట్రీలోకి వచ్చి ఉంటే ఇప్పుడు నేను చాలా సినిమాలు కమిట్ అయ్యి ఉండేదాన్ని.. కానీ నేను డబ్బుకోసం ఇండస్ట్రీలోకి రాలేదు అని అంది పూజాహెగ్డే. నాకు పాత్ర నచ్చితే తరువాత రెమ్యూనరేషన్ గురించి ఆలోచిస్తాను కానీ రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలను ఇబ్బందిపెట్టలేదు అని తెలిపింది పూజా..